నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…

‘చెన్నై లవ్ స్టోరీ’ బ్లాక్బస్టర్ జోష్.. రూ.50 కోట్ల విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసిన టీమ్!
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించింది. హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాకు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. టాలీవుడ్ లో మరోసారి ప్రేమ కథా చిత్రాల స్టామినా తెలియజేసింది “చెన్నై లవ్ స్టోరీ”. ఈ సక్సెస్ నేపథ్యంలో 50 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మా “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు ఇంత ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు థియేటర్స్ కు వెళ్లి టికెట్స్ కొని సినిమా చూడబట్టే ఈ విజయం సాధ్యమైంది. ఇలాంటి మంచి చిత్రాలను ఆదరించడం ద్వారా ఇంకా మరికొన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశాన్ని కల్పించారు. మేము ముందు నుంచీ చెబుతున్నట్లే కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమాకు అన్నీ తానై ముందుండి నడిపించారు. ఆయన నిజంగా బంగారం. కిరణ్ గారితో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా నిర్మించాలని ఉంది. గౌరి ప్రియ నివి పాత్రలో జీవించింది. కలర్ ఫొటో, బేబి, చెన్నై లవ్ స్టోరీ వంటి హార్ట్ టచింగ్ ఎమోషనల్ ప్రేమకథల్ని సాయి రాజేష్ గారు మాత్రమే రాయగలరు. సినిమా నిర్మించడమే కాదు దాన్ని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలో ఎస్ కేన్ కు బాగా తెలుసు. డైరెక్టర్ రవి నంబూరి రెండేళ్లు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. మా “చెన్నై లవ్ స్టోరీ”కి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – ప్రతి సినిమాకు అన్ని క్రాఫ్టుల నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం. ఈ సారి మాత్రం మా ప్రొడ్యూసర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఒక సినిమాను ఇంతలా ప్రమోట్ చేయడం ఇటీవల కాలంలో మా సినిమాకే జరిగింది. నా తొలి చిత్రానికి ఇంత మంచి ప్రచారం కల్పించిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. సాయి రాజేష్ గారు ఫీవర్ వల్ల ఈవెంట్ కు రాలేకపోయారు. ఆయన్ను ఈ వేదిక మీద మిస్ అవుతున్నా. మా కిరణ్ అన్న నాకు అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. కిరణ్ గారికి, గౌరికి రెండు రోజులుగా ఫీవర్. అయినా ఈవెంట్ కు వచ్చారు. మా మూవీకి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అన్నారు.
హీరోయిన్ శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ – ఇటీవల మిమ్మల్ని రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నాం. మా సినిమాకు ఇంతటి విజయాన్ని అందించి 50 కోట్ల రూపాయల వసూళ్ల మూవీగా మార్చినందుకు ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతున్నా. కంటెంట్ బాగుంటే విజయాన్ని అందించడంలో తెలుగు ఆడియెన్స్ ముందుంటారు అని మా మూవీ సక్సెస్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. మా మూవీ రిలీజై వారం రోజులు అవుతోంది. ఈ వారం రోజుల్లో మీరు చూపించి ప్రేమాభిమానాలకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో మీరు చూపిస్తున్న లవ్ ఎలా ఉందో, థియేటర్స్ విజిట్స్ లో మిమ్మల్ని పర్సనల్ గా మీట్ అయినప్పుడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు. ప్రేక్షకులతో మాట్లాడినప్పుడు వారు సినిమాను ఎంత బాగా ఓన్ చేసుకున్నారు అనేది తెలుస్తోంది. మా మూవీకి రిపీటెడ్ ఆడియెన్స్ వస్తుండటం సంతోషంగా ఉంది. ఒక మంచి ప్రేమ కథగా మీ అందరికీ మా మూవీ డీప్ గా కనెక్ట్ అయ్యింది. మీరు పంపుతున్న మెసేజ్ లు చదివి హ్యాపీగా ఫీలవుతున్నాం. ఈ సందర్భంగా మా టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – మా అందరికీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. అందుకే మేమేం మాట్లాడినా ఇప్పుడు వైరల్ అయినట్లే. ప్రీమియర్స్ వేస్తే రనౌట్ అయిపోతాం అనుకున్నాం కానీ హాఫ్ సెంచరీ కొట్టాం. మంచి కంటెంట్ తీసిన వాళ్లు తలదించుకోవాల్సిన అవసరం రాదు అని తెలుగు ఆడియెన్స్ ప్రూవ్ చేశారు. మాకు సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. ఈ మూవీ కోసం బాగా కష్టపడ్డాం. బేబి సినిమాతో మాకు సంతోషాన్ని పంచి, ఈ చిత్రానికి కథను అందించి ప్రొడ్యూస్ చేసిన మా స్నేహితుడు సాయి రాజేష్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. కథ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నమ్మకంతో కిరణ్ గారు కష్టపడుతున్నారు. మేమంతా ప్రమోషన్ లో అలసిపోయినా కిరణ్ గారు, గౌరి జ్వరంతో కూడా థియేటర్స్ విజిట్స్ చేశారు. సినిమాను నమ్మితే కిరణ్ గారు సినిమాను ఎంతగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఈ చిత్రం తెలియజేస్తోంది. 8 రోజుల్లోనే కిరణ్ గారి కెరీర్ లో బిగ్ హిట్ గా మా సినిమా నిలవడం సంతోషంగా ఉంది. మా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, ధీరజ్ కలిసి కిరణ్ గారి కెరీర్ లో బిగ్ హిట్ ను అందించాం. ఆయనకు మేము చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నాం. తెలుగింటి అమ్మాయి శ్రీ గౌరి మల్టీ టాలెంటెడ్. ఆమె పర్ ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఆడియెన్స్ చేసినన్ని రీల్స్ ఇటీవల మరే సినిమాకు రాలేదు. జనాల్ని మనం మెప్పించాం, థియేటర్స్ కు రప్పించాం అనే ఆనందం మా అందరిలో ఉంది. మా మూవీ మంచి రన్ తో ప్రదర్శితమవుతోంది. ఆగస్టు 15 వరకు ఇలాగే కంటిన్యూ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే హ్యాపీగా ఉంది. రవికి మంచి లాంఛ్ అవ్వాలని కోరుకున్నట్లే మా సినిమాకు మంచి విజయం దక్కింది. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – కొద్ది రోజులుగా మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మన మీడియా మిత్రులను కలుస్తున్నాం. మీరు మా మూవీకి అందిస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ లకు సినిమా మీద ఉన్న ప్యాషనే మమ్మల్ని డ్రైవ్ చేస్తోంది. ఇంత పెద్ద సక్సెస్ మా సినిమాకు దక్కిందంటే కారణం మా ప్రొడ్యూసర్స్. సినిమా కోసం మీరు రాజీ పడకుండా ఖర్చు పెడుతుంటారు. రీసెంట్ గా గౌరి నేను చాలా ఏరియాస్ లో థియేటర్స్ విజిట్ చేశాం. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీలయ్యాం. మాది ప్రేమ కథా చిత్రం కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా రారా అనే సందేహం ఉండేది. ప్రమోషన్స్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మా సినిమా నచ్చుతుందని మేము చెబుతూ వస్తున్నాం. మేము థియేటర్ విజిట్స్ లో చూశాం ప్రతి థియేటర్ లో ఎక్కువ సంఖ్యలో ఫ్యామిలీ ఆడియెన్స్ ఉంటున్నారు, మా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. వీక్ డేస్ లో కూడా మీ ఆదరణ దక్కడం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయని చెబుతున్నారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటమే నిజమైన విజయం. ఆ విజయం మా సినిమాకు దక్కింది. మా మూవీకి ప్రేక్షకులు మరింత లాంగ్ రన్ ఇవ్వబోతున్నారు. అన్నారు.
| నటీనటులు & సాంకేతిక నిపుణులు | |
|---|---|
| నటీనటులు | కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, త్రిగుణ్, సిరి హన్మంతు, దేవిప్రసాద్, కరుణకుమార్, మహేందర్, నరేష్, పూజ, ప్రమోదిని, తదితరులు |
| కాస్ట్యూమ్ డిజైనర్ | దేవి పర్చూరి |
| ఆర్ట్ | భాస్కర్ ముదావత్ |
| ఎడిటర్ | సంతోష్ నాయుడు |
| డీవోపీ | విశ్వాస్ డేనియల్ |
| లిరిక్స్ | అనంత్ శ్రీరామ్ |
| మ్యూజిక్ డైరెక్టర్ | మణిశర్మ |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | విశాల దాట్ల |
| లైన్ ప్రొడ్యూసర్ | శ్యామ్ ప్రసాద్ మేక |
| పి.ఆర్.ఓ | సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా |
| మార్కెటింగ్ | హౌస్ ఫుల్ |
| కో ప్రొడ్యూసర్ | ధీరజ్ మొగిలినేని |
| కథ | సాయి రాజేష్ |
| నిర్మాతలు | ఎస్ కేఎన్, సాయి రాజేష్ |
| స్క్రీన్ప్లే, దర్శకత్వం | రవి నంబూరి |
