రైజింగ్ యంగ్ స్టార్ నార్నే నితిన్ 'మ్యాడ్', 'ఆయ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి వరుస విజయాల తర్వాత తన కెరీర్లో…

మరో సెన్సేషనల్ సాంగ్ ‘జిగితార..’తో రాబోతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్
హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ నుంచి మరో సెన్సేషనల్ సాంగ్ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ‘తొలి ప్రేమేం తోపు కాదే..’, ‘వదలనే..’ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట ‘జిగితార..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 20న తిరుపతిలో గ్రాండ్ మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ లోని మ్యాజిక్ ను లైవ్ లో చూసేందుకు ఈ మ్యూజికల్ ఫెస్ట్ లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో “చెన్నై లవ్ స్టోరీ” మూవీ తిరుపతి మ్యూజికల్ ఫెస్ట్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“చెన్నై లవ్ స్టోరీ” సినిమాలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ నటిస్తోంది. “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందించగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం “చెన్నై లవ్ స్టోరీ” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు
.
| నటీనటులు & సాంకేతిక బృందం | |
|---|---|
| నటీనటులు | కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు |
| టెక్నికల్ టీమ్ | |
| కాస్ట్యూమ్ డిజైనర్ | దేవి పర్చూరి |
| ఆర్ట్ | భాస్కర్ ముదావత్ |
| ఎడిటర్ | సంతోష్ నాయుడు |
| డీవోపీ | విశ్వాస్ డేనియల్ |
| లిరిక్స్ | అనంత్ శ్రీరామ్ |
| మ్యూజిక్ డైరెక్టర్ | మణిశర్మ |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | విశాల దాట్ల |
| లైన్ ప్రొడ్యూసర్ | శ్యామ్ ప్రసాద్ మేక |
| పీఆర్ఓ | సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా |
| మార్కెటింగ్ | హౌస్ ఫుల్ |
| కో ప్రొడ్యూసర్ | ధీరజ్ మొగిలినేని |
| స్టోరీ | సాయి రాజేశ్ |
| నిర్మాతలు | ఎస్ కేఎన్, సాయి రాజేశ్ |
| స్క్రీన్ ప్లే, డైరెక్షన్ | రవి నంబూరి |
