మాస్ మహారాజ్ రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది…

దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా ‘జయహో జనార్ధన’ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్!
పెద్ది సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన బుచ్చిబాబు గారు జయహో జనార్ధన సినిమా లోని హై ఎనర్జిటిక్ సాంగ్ ఆయన ‘ *చిందువేయవే చాందుక తుకడ ‘* అనే సాంగ్ ను రిలీజ్ చేయడం జరిగింది.. నేషనల్ అవార్డ్ విన్నర్ సుద్దాల అశోక్ తేజ గారు స్వరపరిచిన ఈ పాట ను నాని మూవీ ప్యారడైజ్ లో సూపర్ సూపర్ హిట్ అయిన ఆయా షేర్ అనే పాట పాడిన జంగి రెడ్డి ఆలపించడం జరిగింది.. ఫీమేల్ వెర్షన్ ను మోహనా భోగరాజు పాడారు…వినగానే హమ్ చేయాలి అనిపించే ఈ పాటకు మరియు సినిమాకు అద్భుతమైన సంగీతాన్నీ చరణ్ అర్జున్ అందించారు.
పానుగంటి ప్రొడక్షన్స్ పతాకంపై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా జయహో జనార్ధన. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో 30ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, BVM శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నందమూరి హరి, కెమెరామెన్ గా విజయ్ ఠాగూర్ ఆర్ డైరెక్టర్ గా భూపతి యాదగిరి పనిచేయగా మ్యూజిక్ అందించింది చరణ్ అర్జున్.
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లాంచ్ విజనరీ డైరెక్టర్ సంపత్ నంది గారి చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు చిత్ర యూనిట్ . త్వరలోనే సినిమా కు సంబంధిన టీజర్ , ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారునిర్మాత, దర్శకుడు అయిన పానుగంటి శరత్ రెడ్డి .
| నటీనటులు | నరేష్ వాసం, రమ్యశ్రీ, 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, BVM శివశంకర్ తదితరులు |
|---|---|
| బ్యానర్ | పానుగంటి ప్రొడక్షన్స్ |
| నిర్మాత & దర్శకుడు | పానుగంటి శరత్ రెడ్డి |
| కో డైరెక్టర్ | నరసింహారావు |
| చీఫ్ అసోసియేటివ్ డైరెక్టర్ | పోలు జగన్మోహన్ రెడ్డి |
| సినిమాటోగ్రాఫర్ | విజయ్ టాగూర్ |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | జగదీష్ బాబు తాడిపత్రి |
| ప్రొడక్షన్ కంట్రోలర్ | ఓంకార్ నల్లమోతుల |
| ఆర్ట్ | భూపతి యాదగిరి |
| ఎడిటర్ | నందమూరి హరి, ఎన్టీఆర్ |
| స్టంట్ | శివరాజ్ కుమార్ |
| మ్యూజిక్ | చరణ్ అర్జున్ |
| పి ఆర్ ఓ | నాగేశ్వరరావు (ఎస్ ఎన్ ఆర్) |
