శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం…

ఆగస్ట్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ స్ట్రీమింగ్!
ఎలన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. ఎ రైజ్ ఈస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎలన్ దర్శకత్వంలో శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో..
నిర్మాత శ్రీనిధి సాగర్ మాట్లాడుతూ ‘‘నేను గుంటూరు వాడిని. అయితే చెన్నైలో చదువుకున్నాను. అక్కడే సెటిలైయ్యాను. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో నా రెండో సినిమా. ఈ ఏడాది మార్చిలో మేడిన్ కొరియా అనే సినిమాను రిలీజ్ చేశాం. దాని తర్వాత మేం చేసిన సినిమా ఇది. మా తొలి సినిమాలాగానే ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని భావిస్తున్నాం. ఓ సీరియస్ సబ్జెక్ట్‌ను కామెడీ కోణంలో చెప్పే ప్రయత్నం చేశాం. ఎలన్ మా బ్యానర్‌లో చేసిన రెండో సినిమా ఇది. మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు. తనతో మా జర్నీ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. శాన్వీ మేఘనను తమిళంలో నేనే లాంచ్ చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. మా ఫ్రెండ్స్ చేసిన కుడుంబస్తన్ సినిమాతో అక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మా బ్యానర్‌లో ఈ సినిమా చేశారు. తను ఎంతో చక్కగా చేశారు. తమిళంలో తనే డబ్బింగ్ చెప్పుకున్నారు’’ అన్నారు.
హీరోయిన్ శాన్వీ మేఘన మాట్లాడుతూ ‘‘నా తమిళ సినిమా ట్రైలర్ తెలుగులో రిలీజ్ అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. మూడు నాలుగేళ్ల ముందు నేను పిట్ట కథలు అనే అంథాలజీలో యాక్ట్ చేశాను. తరుణ్ భాస్కర్‌గారు డైరెక్ట్ చేశారు. అది నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజైంది. తర్వాత ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో నా సినిమా రిలీజ్ అవుతుంది. సాగర్‌గారికి థాంక్స్. ఎలన్ చాలా ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశారు. అబ్బాయి పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి వస్తే ఎలాంటి బాధలు పడతాడనేది సినిమాలో చూస్తారు. అలాగని బాధలను ఈ సినిమాలో చూపించటం లేదు. ఎంటర్‌టైనింగ్‌గా మూవీ ఉంటుంది. రాధికాగారు.. యాక్టింగ్‌లో చింపేశారు. ఆగస్ట్ 21న సినిమా రిలీజ్ అవుతుంది. యువన్ శంకర్‌రాజాగారి మ్యూజిక్‌లో సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు మూడు సాంగ్స్ రిలీజయ్యాయి. హిట్ ఆల్బమ్. ఎలన్ తమిళంలో స్టార్, ప్యార్ ప్రేమ కాదల్ అనే రెండు సినిమాలు చేశాడు. రెండూ హిట్ అయ్యాయి. తనే యాక్టర్, డైరెక్టర్ కాబట్టి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాతోనే తమిళం డబ్బింగ్ చెప్పించారు. తను వండర్‌ఫుల్ కో స్టార్. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.
హీరో, డైరెక్టర్ ఎలన్ మాట్లాడుతూ ‘‘నేను ఎప్పటి నుంచో తెలుగు సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాను. ప్యార్ ప్రేమ కళ్యాణంతో అది నిజమవుతుంది. నా నిర్మాత సాగర్‌గారికి, నెట్‌ఫ్లిక్స్ సంస్థకు థాంక్స్. నేను కలిసిన వాళ్లలో శాన్వీ బ్యూటీఫుల్ పర్సన్. సినిమా పరంగా కో ఆపరేట్ చేసింది. 32 రోజుల్లో సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. ఇందులో కాస్ట్యూమ్స్ చేంజ్ ఎక్కువగా ఉండింది. అయితే శాన్వీ సపోర్ట్ చేయటంతో చాలా త్వరగా సినిమాను పూర్తి చేశాం. తెలుగు వాళ్లు మా సినిమా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
| నటీనటులు | |
|---|---|
| నటీనటులు | ఎలన్, శాన్వీ మేఘన, రాధికా శరత్ కుమార్ తదితరులు |
| సాంకేతిక వర్గం | |
| దర్శకత్వం | ఎలన్ |
| నిర్మాత | శ్రీనిధి సాగర్ |
| స్టోరీ, స్క్రీన్ ప్లే | నివేదిత |
| మ్యూజిక్ | యువన్ శంకర్ రాజా |
| సినిమాటోగ్రఫీ | దినేష్ బాబు |
| ప్రొడక్షన్ డిజైన్ | ఎ. గోపి ఆనంద్, శ్రీనివాస కళింగ |
| ఎడిటర్ | ప్రదీప్ ఇ. రాఘవ్ |
| అడిషనల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే | ఎలన్, హరీష్.జి.వై |

