I am text block. Click edit button to change this text. Lorem ipsum dolor sit…

చిన్నారి నక్షిత వైద్యం కోసం అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమానాన్ని కేవలం సినిమాల విజయోత్సవాలకు మాత్రమే పరిమితం చేయకుండా, సామాజిక బాధ్యతను కూడా చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మరోసారి మానవత్వాన్ని చాటుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచే “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే అరుదైన జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య కారణంగా చిన్నారి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇప్పటికే రెండు శస్త్రచికిత్సలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు త్వరలో మరో కీలక శస్త్రచికిత్స జరగనుండటంతో కుటుంబంపై భారీ ఆర్థిక భారం పడింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యాలయం వెంటనే స్పందించింది. చిన్నారి నక్షిత వైద్య చికిత్సలు, ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించి తమ పెద్ద మనసును చాటుకుంది. ఈ సందర్భంగా AAFA ప్రతినిధులు మాట్లాడుతూ, అభిమాన సంఘం అనేది కేవలం హీరో సినిమాలను ప్రోత్సహించడానికే కాదు, అభిమాన కుటుంబాలకు కష్టసమయంలో అండగా నిలబడటానికి కూడా ఉందని తెలిపారు. సంఘ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైతే, వారికి అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తామని పేర్కొన్నారు.
చిన్నారి నక్షిత త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన అభిమాన సంఘం సభ్యులు, భవిష్యత్తులో కూడా సతీష్ కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ అభిమాన సంఘం చేస్తున్న ఈ సహాయం పట్ల పలువురు అభిమానులు, స్థానికులు అభినందనలు తెలియజేస్తూ, అభిమాన సంఘాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ఆదర్శనీయమని కొనియాడుతున్నారు.
