శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో…

నటుడు మహేష్ యాదవ్ పుట్టినరోజు స్పెషల్ ఇంటర్వ్యూ
మహేష్ యాదవ్ నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన నటుడు, సినిమా పట్ల ఆసక్తితో ఎలా అయినా సరే నడుడు అవ్వాలని చేసే ప్రయత్నల్లో అనుకోకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను కలవడం జరిగింది. మహేష్ యాదవ్ లోని నడుడిని గుర్తించిన తరుణ్ భాస్కర్ ఈనగరానికి ఏమైంది సినిమాలో ల్యాబ్ అసిస్టెంట్ పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ పాత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది, అక్కడినుండి మహేష్ యాదవ్ నట ప్రస్థానం ప్రారంభం అయ్యింది.
కీడాకోల సినిమాలో సత్తి (పొలిటిషియన్ ), ఓం శాంతి శాంతి, ప్రేమంటే, భామకలాపం, సత్తిగాని రెండెకరాలు, రాజుగాడు, నన్నుదోచు కుందువతే, అద్భుతం, జగమెమాయ, భీమ్లానాయక్, స్కై ల్యాబ్, అదర్వ, శభరి, ఇంటింటిరామాయణం, ఉప్పుకప్పురంబు , త్రిబనదారి బార్బరిక్, మిత్రమండలి చిత్రాల్లో నటించారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో కోటిసార్ పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే
రాముల వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి అనుచరుడిగా రామకృష్ణ పాత్రలో నటించారు మహేష్ యాదవ్ అలాగే గాడ్సే అఫ్ ధర్మపురి, కుబుల్ హై, మాయబజార్, శశి మధనం, శివరిపల్లి, సూపర్ సుబ్బు వెబ్ సీరీస్ ల్లో నటించారు.
మహేష్ యాదవ్ బద్మాషులు చిత్రంలో హీరోగా నటించారు, రవితేజ ఇరుముడి సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ లో నటించారు, ఈనగరానికి ఏమైంది 2 లో మంచి లెన్త్ రోల్ లో నటించారు అలాగే సమ్మర్ హాలిడేస్, మారెమ్మ, ఆనంద్ దేవరకొండ తక్షకుడు, బెల్లంకొండ శ్రీనివాస్ టైషన్ నాయుడు చిత్రాల్లో నటించారు త్వరలో ఈ చిత్రాలు విడుదల కానున్నాయి
మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి తో బ్రహ్మానందం, కోటా శ్రీనివాస్ ను ఆదర్శంగా తీసుకొని మహేష్ యాదవ్ సహజమైన నటనతో కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, భవిషత్తులో మరిన్ని మంచి సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
