మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో…

‘సమ్మర్ హాలిడేస్’ చూస్తే పెద్దలు కూడా పిల్లలైపోతారు.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు: కిరణ్ అబ్బవరం!
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం మాట్లాడుతూ – హిందీలో తారే జమీన్ పర్ సినిమాలా తెలుగులో సమ్మర్ హాలీడేస్ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ – ఈ సినిమాలో కథతో పాటు ప్రతి పాత్రను మీరు గుర్తుపెట్టుకుంటారు. ప్రతి లీడ్ యాక్టర్ చేసిన క్యారెక్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ దీపావళికి మీ ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేసేలా మా సమ్మర్ హాలీడేస్ సినిమా ఉంటుంది. అన్నారు.
యాక్టర్ రమణ భార్గవ్ మాట్లాడుతూ – సమ్మర్ హాలీడేస్ పెద్ద వాళ్లు చూసి ఆనందించే పిల్లల సినిమా. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ గతం గుర్తుకు వస్తుంది. అన్నారు.
యాక్టర్ మహేశ్ చింతల మాట్లాడుతూ – ఈ సినిమాలో సూరి అనే పాత్రలో నటించాను. రాజీవ్ కనకాల కాంబినేషన్ లో నా సీన్స్ ఉంటాయి. ఈ దీపావళి పండక్కి మా సినిమాకు పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ అశోక్ మాట్లాడుతూ – అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాక థ్యాంక్స్ మీట్ పెడుతుంటారు. కానీ ఇలాంటి మంచి సినిమా తమకు అందించినందుకు మాకే ప్రేక్షకులు కృతజ్ఞతలు చెబుతారు అనిపిస్తోంది. అలాంటి ఒక అరుదైన సినిమాను మేము ఆడియెన్స్ కు ఇవ్వబోతున్నాం. అన్నారు.
నటి హర్షిణి మాట్లాడుతూ – ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ తో పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో నేనొక సర్ ప్రైజింగ్ రోల్ చేశాను. ఈ క్యారెక్టర్ లో పర్ ఫార్మ్ చేయడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. సినిమాలో నా రోల్ చూశాక ఆడియెన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతారు. మీ దగ్గర నుంచి ప్రశంసలు పొందుతానని ఆశిస్తున్నా. అన్నారు.
కొరియోగ్రాఫర్ సందీప్ మాట్లాడుతూ – ప్రతి ఒక్కరికీ రిలేటబుల్ స్టోరీ ఇది. ఈ సినిమా గురించి డైరెక్టర్ చెబుతున్నప్పుడు ఒక తండ్రిగా మా అబ్బాయితో నేను ఎలా ఉండాలో తెలుసుకున్నాను. ఇలాంటి మంచి చిత్రానికి వర్క్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
మాస్టర్ ప్రజ్వల్ మాట్లాడుతూ – 35 ఇది చిన్న కథ కాదు సినిమాలో అరుణ్ తో కలిసి నటించాను. అతనికి నేషనల్ అవార్డ్ రావడం మా అందరికీ సంతోషాన్నిచ్చింది. వింటర్ లో రిలీజ్ అయ్యే ఈ సినిమా మళ్లీ సమ్మర్ వరకు థియేటర్స్ లో రన్ అవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ – నేను ఎన్ని మూవీస్ చేసినా సమ్మర్ హాలీడేస్ నా మనసులో ప్రత్యేకంగా ఉండిపోతుంది. హీరో బాలకృష్ణ ఆదిత్య 369లో ట్రావెల్ చేసినట్లు నాకు ఈ సినిమాతో 90’s కు వెళ్లిన ఫీల్ కలిగింది. డైరెక్టర్ శ్రీకర్ గారు ఎంతో ఓపికగా మాతో ఈ మూవీ చేయించారు. జయసుధ గారితో కలిసి నటించడం నా అదృష్టం. మా టీమ్ అందరి కష్టంతో ఈ సినిమా ఇంత బాగా మీ ముందుకు రాబోతోంది. సింజిత్ మ్యూజిక్ మా మూవీకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ నెల 6న రిలీజ్ కు వస్తున్న మా సమ్మర్ హాలీడేస్ సినిమాను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
మాస్టర్ రోహన్ రాయ్ మాట్లాడుతూ – మా మూవీలో ఎంతోమంది పేరున్న నటీనటులు ఉన్నారు. ఇంత మంచి కాస్టింగ్ చేసిన సినిమా చిన్న సినిమా కాదు. మా మూవీ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు. జయసుధ గారితో నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. వాసుకి గారు, హర్షిణి గారితో నటిస్తున్నప్పుడు ఎంతో నేర్చుకున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శ్రీకర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
సహజనటి జయసుధ మాట్లాడుతూ – ఈ పిల్లలు మాట్లాడే అందమైన మాటలు చూస్తుంటే మళ్లీ స్కూల్ కు వెళ్లాలనిపిస్తోంది. ఈ సినిమాలో అమ్మమ్మ పాత్రలో నటించాను. ఇది పిల్లల సినిమా కాదు ఇద్దరు చిన్న హీరోలు నటించిన సినిమా. పేరెంట్స్, అమ్మమ్మ, వేసవి సెలవులు…ఈ అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. 60’s నా సమ్మర్ హాలీడేస్. అప్పుడైనా ఇప్పుడైనా వేసవి సెలవులు అందరికీ ఒక్కటే. అందరూ ఈ సినిమా చూడాలి. సింజిత్ పాటలు బాగున్నాయి. ధీరజ్ ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని చేయాలి. కొత్త దర్శకులకు, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలి. పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చిన్న చిత్రాలు నిర్మించాలి. సినిమా హిట్ అయ్యాక చిన్నా, పెద్దా అనేది ఉండదు. ప్రేక్షకులు మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి వాసుకి మాట్లాడుతూ – ఈ సినిమా కథాంశం సమ్మర్ హాలీడేస్ చుట్టూ సాగినా మంచి కంటెంట్ ఉంది. అది సమ్మర్, వింటర్, ఏ కాలంలో అయినా ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ కథ విన్నప్పుడు నేను నా బాల్యంలోకి వెళ్లిన ఫీల్ కలిగింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వస్తుంది. ప్యాషనేట్ టీమ్ ఈ సినిమాకు పనిచేసింది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
డైరెక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ – నాకు కావాల్సిన వాళ్లు చాలా మంది ఈ సినిమాకు వర్క్ చేశారు. సమ్మర్ హాలీడేస్ మూవీ మీ అందరినీ ఆకట్టుకుని సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ రామ్ జగదీశ్ మాట్లాడుతూ – సమ్మర్ హాలీడేస్ కంటెంట్ చూస్తుంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. వేసవి సెలవులు ఎంతో బాగుండేవి. వాటి కోసం మనమంతా వేచి చూసేవాళ్లం. ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో సినిమా చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ – సినిమా థియేటర్ ను మించిన టైమ్ మెషీన్ ఏదీ ఉండదు. మనల్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంటుంది. సమ్మర్ హాలీడేస్ మూవీతో మన బాల్యంలోకి తీసుకెళ్లే టైమ్ మిషీన్ ను ఈ టీమ్ అంతా తయారు చేశారు. ఈ సినిమా వాళ్లకు మంచి సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – ఈ సినిమాకు దాదాపు ఏడాది పాటు వర్క్ చేశాం. ఈ టీమ్ అందరినీ మిస్ అవుతున్నాననే బాధ కలుగుతోంది. ఈ టైమ్ లో మా టీమ్ అంతా చాలా స్ట్రెస్ లో ఉన్నాం. చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా మంచి హిట్ కావాలి. మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ నయన్ మాట్లాడుతూ – ఈ పిల్లలతో ఇక ఉండలేనేమో అని బాధగా ఉంది. పిల్లల పేరెంట్స్ సపోర్ట్ వల్లే మూవీ చేయగలిగాం. నా యాక్టర్స్ అందరికీ ఈ సినిమాతో మరింత మంచి పేరొస్తుంది. జయసుధ గారిని అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. నా టెక్నికల్ టీమ్ అంతా సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. మా సినిమాకు ఇద్దరు హీరోలు సింజిత్, ధీరజ్ గారు. ధీరజ్ గారిని ఒక మెంటార్ లా భావిస్తా. సమ్మర్ హాలీడేస్ గుర్తుండిపోయే సినిమా, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ – ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నా బాల్యం గుర్తుకువచ్చింది. డైరెక్టర్ శ్రీకర్ ఒక కన్విక్షన్ తో ఈ సినిమా తెరకెక్కించాడు. మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. అన్నారు.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – కథను నమ్మి ఇలాంటి మంచి సినిమా చేసిన ప్రొడ్యూసర్ ధీరజ్ ను అభినందిస్తున్నా. పిల్లల సినిమాలు తెలుగులో రావడం లేదని ఇద్దరు పిల్లల తండ్రిగా బాధపడుతుంటా. ఆ లోటు సమ్మర్ హాలీడేస్ తో తీరుతుందని నమ్ముతున్నా. ఈ కథలోని స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసుకునేందుకు థియేటర్ లో మూవీ చూస్తాను. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – ఇది పిల్లల సినిమా కాదు పెద్దల సినిమా. కథ విన్నప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యాను. నా ఏజ్ గ్రూప్ వాళ్లు అందరూ కనెక్ట్ అవుతారని నమ్మాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీ బాల్యం గుర్తుకు వస్తుంది. ఆ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీ చిన్ననాటి స్నేహితులకు ఫోన్స్ చేస్తారు. పిల్లలు నటించిన పెద్దల చిత్రమిది. పెద్దలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇందాక రాహుల్ చెప్పినట్లు ఇందులో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. అదే మన మెమొరస్. ఈ బిజీ లైఫ్ వల్ల మనం మర్చిపోతున్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుందీ మూవీ. నేను కొన్ని సినిమాలనే ఫ్యామిలీతో కలిసి చూస్తాను. మా సమ్మర్ హాలీడేస్ సినిమా మీ కుటుంబం అందరూ కలిసి చూసేలా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఒక పాయింట్ నచ్చుతుంది. ఈ దీపావళికి సమ్మర్ హాలీడేస్ సినిమాతో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయబోతున్నాం. ఏ పెద్ద చిత్రానికీ తీసిపోని కంటెంట్ మా మూవీలో ఉంటుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరంతో ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలని ఉంది. అన్నారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ – ప్రొడ్యూసర్ ధీరజ్ ఏ సినిమా చేసినా డబ్బులొచ్చే సినిమానే చేస్తారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత నా ఫ్యామిలీకి ఈ సినిమా చూపించాలని అనిపించింది. మన జెనరేషన్స్ చాలా అదృష్టవంతులు. ఇప్పుడు పిల్లలకు చదువు, స్ట్రెస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ సినిమా ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తుందని అనుకుంటున్నా. చిన్న పిల్లలతో సినిమా చేయడం అంత సులువు కాదు. డైరెక్టర్ శ్రీకర్ మంచి ఔట్ పుట్ తీసుకొచ్చాడు. పిల్లలంతా చాలా బాగా నటించారు. పిల్లలు ఎంత ప్యూర్ గా ఉంటారో ఈ సినిమా కూడా అంతే ప్యూర్ గా ఉంటుంది. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ఈ ఈవెంట్ చాలా ప్లెజెంట్ గా ఉంది. ఈ వేడుక చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమాకు పనిచేసిన పిల్లలు చాలా టాలెంటెడ్ గా ఉన్నారు, కాన్ఫిడెంట్ గా వేదిక మీద మాట్లాడుతున్నారు. వాళ్లను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ వయసులో ఉన్నప్పుడు మాకు ఏదీ తెలిసేది కాదు. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మనమంతా లైఫ్ లో చాలా బిజీగా గడిపేస్తున్నాం. కానీ ఎంత డబ్బున్న వారైనా ఒక్క ఏడాది వ్యవసాయం చేస్తే మన లైఫ్ లో ఎంతో ప్రశాంతత వస్తుంది. ఈ సినిమా కంటెంట్ చూస్తున్నంత సేపు మనకు తెలియని ఎమోషన్స్ కనెక్ట్ చేస్తున్నారు అనిపించింది. ఈ సినిమా మనం మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంది. ఈ సినిమా ద్వారా మనల్ని , మన అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తారని నమ్ముతున్నాను. ఇది చిన్న సినిమా, పిల్లల సినిమా అని ఎక్కడా అనిపించట్లేదు. వాళ్ల ఎనర్జీ చూస్తుంటే సినిమాలో మనల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తారనిపిస్తోంది. ప్రొడ్యూసర్ ధీరజ్ అన్న నమ్మకం నిజం కావాలి. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ దీపావళికి సమ్మర్ హాలీడేస్ సినిమాకు థియేటర్స్ కు వెళ్లండి. ప్రేక్షకులంతా చిన్న పిల్లలైపోయి సినిమాను ఎంజాయ్ చేస్తారు. అన్నారు
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – ధీరజ్ నాతో పాటు సినిమాలు చేశాడు. ఈ సినిమా బాగా వచ్చిందని విన్నాను. సరిగ్గా లేని సీన్స్ మళ్లీ తీసుకోవడం గీతా ఆర్ట్స్ లో అలవాటు. అదే ధీరజ్ ఫాలో అయ్యాడు. డైరెక్టర్ శ్రీకర్ ఈ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించాడని విన్నాను. ఇలాంటి మంచి చిత్రాలను సపోర్ట్ చేసేందుకు హీరో కిరణ్ అబ్బవరం రావడం ప్రశంసనీయం. ఏదో చిన్న సినిమా అనుకోకుండా చాలా మంది దర్శకులు అతిథులుగా వచ్చి తమ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయబోతున్నారు. మంచి నోల్టాల్జిక్ ఫిలిం అనిపిస్తోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు
| విభాగం | వివరాలు |
|---|---|
| నటీనటులు | రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ తదితరులు |
| డీవోపీ | సాయి ప్రకాశ్ |
| మ్యూజిక్ డైరెక్టర్ | సింజిత్ యెర్రమల్లి |
| బ్యానర్ | ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ |
| పీఆర్ఓ | సురేష్ (ఎస్.కె. మీడియా) |
| ప్రొడ్యూసర్ | ధీరజ్ మొగిలినేని |
| స్టోరీ, డైరెక్టర్ | శ్రీకర్ |
“`


