హీరో, హీరోయిన్ని ప్రేమిస్తానంటాడు.. దానికి బదులుగా ‘‘పడుచు పిల్ల కానొస్తే... ఓ నాలుగు దినాలు వెనక పడి... పని కానిచ్చుకొని..…

‘321’ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం – ప్రెస్ మీట్లో దర్శక, నిర్మాత శాంతి కుమార్
బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద శాంతి కుమార్ చిలుముల, రామానుజ రెడ్డి వంగపాటి నిర్మాణంలో శాంతి కుమార్ చిలుముల తెరకెక్కించిన చిత్రం ‘321’. ఉప శీర్షిక లవ్ మ్యారేజ్ వర్సెస్ అరెంజ్డ్. ఈ సినిమాలో మోహిత్, లావణ్య జంటగా నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేయబోతోన్నారు.. ఈ క్రమంలో బుధవారం నాడు చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో..
దర్శక, నిర్మాత శాంతి కుమార్ మాట్లాడుతూ .. ‘నాకు ఈ జర్నీలో తోడుగా నిలిచిన మోహన్ గారు, మయూర్ పట్నాల, మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి థాంక్స్. ఐటీ అనేది నా ప్రొఫెషన్, ఆర్ట్స్ అనేది నా ప్యాషన్. ఈ చిత్రంలోని ఆర్టిస్టులంతా కూడా అద్భుతంగా నటించారు. మాధవి గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. ఆమె ఇచ్చిన రిఫరెన్సులతోనే ఎంతో మంది ఆర్టిస్టుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. కాల్విన్ జాయ్ మ్యూజిక్ బాగా వచ్చింది. మౌన శ్రీ గారు పాటలు రాయడమే కాకుండా ఈ సినిమాలో మంచి పాత్రను పోషించారు. మా సినిమా అద్బుతంగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూసేలా మా చిత్రం ఉంటుంది. అక్టోబర్ 23న మా మూవీ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత రామానుజ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘నేను ఇండస్ట్రీలో చాలా మంది వద్ద అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేశాను. శాంతి కుమార్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ మూవీతోనే నేను నిర్మాతగా పరిచయం కాబోతోన్నాను. ఈ సినిమా బాగుంటుంది. ఈ చిత్రాన్ని కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి మాట్లాడుతూ .. ‘‘321’ టైటిల్, ఆ డిజైనింగ్‌లోనే కథ అంతా ఉంది. మూడు ముళ్లు, ఇద్దరు మనుషులు, ఒక జీవితం అని అర్థం వచ్చేలా డిజైన్ చేశాం. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్ లోగోని శాంతి కుమార్ గారు దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాంతి కుమార్ గారికి థాంక్స్’ అని అన్నారు.
సంగీత దర్శకుడు కాల్విన్ జాయ్ మాట్లాడుతూ .. ‘‘321’ చిత్రంలో శాంతి కుమార్ గారు ఓ పాట రాశారు. మౌన శ్రీ గారు బ్రేకప్ సాంగ్ రాశారు. ఈ మూవీనిలో రెండు పాటలు అద్భుతంగా ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
లిరిక్ రైటర్ మౌన శ్రీ మాట్లాడుతూ .. ‘‘321’ ఓ గొప్ప చిత్రంగా నిలుస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. ఎలాంటి బూతులు, అశ్లీల సన్నివేశాలు లేకుండా శాంతి కుమార్ ఎంతో క్లీన్‌గా సినిమాని తెరకెక్కించారు. ఇందులోని కథ గొప్పగా ఉంటుంది. ఈ సినిమాని థియేటర్లో చూడకపోతే చాలా మిస్ అవుతారు’ అని అన్నారు.
నటుడు శ్రీనివాస్ భోగిరెడ్డి మాట్లాడుతూ .. ‘‘321’ సినిమా గొప్పగా వచ్చింది. ఇలాంటి మంచి మూవీని అందరూ ఆదరించాలి. మా చిత్రాన్ని మీడియా ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటి లావణ్య మాట్లాడుతూ .. ‘’321’ సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుత తరం చూడాల్సిన చిత్రమిది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా మూవీ ఉంటుంది. ఇంత మంచి చిత్రంలో ఇంత గొప్ప పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. జాయ్ సర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మేం ఎంత ఎంజాయ్ చేశామో.. సినిమా చూశాక ఆడియెన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. అక్టోబర్ 23న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటుడు వివాన్ సూర్య మాట్లాడుతూ .. ‘‘321’ చిత్రంలో నేను విజయ్ అనే పాత్రను పోషించాను. అంత మంచి కారెక్టర్‌ను నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అక్టోబర్ 23న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
మయూర్ పట్నాల మాట్లాడుతూ .. ‘‘మేం స్వచ్చంద సంస్థతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఆ సమయంలోనే నాకు శాంతి కుమార్ గారు పరిచయం అయ్యారు. మాతో ఆయన పని చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
| నటీనటులు | |
|---|---|
| నటీనటులు | మోహిత్, లావణ్య, వివాన్ సూర్య, లక్ష్మీ వెన్నెల, యామిని, శ్రీనివాస్ భోగిరెడ్డి, ప్రభావతి, మాధవి, విద్యా సాగర్ తదితరులు |
| టెక్నికల్ టీం | |
| బ్యానర్ | బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ |
| నిర్మాతలు | శాంతి కుమార్ చిలుముల, రామానుజ రెడ్డి వంగపాటి |
| దర్శకత్వం | శాంతి కుమార్ చిలుముల |
| సంగీతం | కాల్విన్ జాయ్ |
| సింగర్స్ | సాయి చరణ్, హరిణి |
| సాహిత్యం | శాంతి కుమార్ చిలుముల, మౌన శ్రీ |
| ఎడిటర్ | శివ శర్వాణి |
| సాంగ్ కొరియోగ్రఫీ | మెహర్ బాబా మాస్టర్ |
| కెమెరామెన్ | శివ ప్రసాద్ ముప్పాల |
