Skip to content

వైభవంగా గణపతి పూజ.. భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు!

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలోని నలందనగర్‌ 25వ వీధిలో లంబోదరాయ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం గణపతి పూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంబోదరుడికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంతో నలందనగర్‌ 25వ వీధిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ పూజా కార్యక్రమంలో లంబోదరాయ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు దేవన బోయన హర్ష నాయుడు, టంకారి వినోద్‌ కుమార్‌, జి. సుహాస్‌ రెడ్డి, సాయి సంకల్ప్‌, అర్జున్‌ యాదవ్‌, సిద్దార్థ్‌ గౌడ్‌, డెక్కన్‌ కా రాజా, పూజారి శ్రీ పరాశర శ్రీరామ బట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.

Back To Top