Skip to content

భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజ.. సందడిగా స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్స్!

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలోని స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం గణనాథుడి పూజను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్స్‌ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. వేదపండితులు సముద్రాల శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో గణపతి పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించి, గణనాథుడికి ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణలు చేశారు. పూజా కార్యక్రమంలో నర్వ స్వాతి, రాజేంద్రప్రసాద్, హర్ష, వామిక, ప్రకాష్‌రావ్, విజయలక్ష్మి, సంధ్యతో పాటు పలువురు స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్స్‌ వాసులు పాల్గొని గణనాథుడి ఆశీస్సులు అందుకున్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో పూజా కార్యక్రమం సందడిగా సాగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Back To Top