సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా…

సరికొత్త కథతో ‘అగమ్య’.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం!
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘ఋషి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త చిత్రం ‘అగమ్య’ కార్యాలయం ఈరోజు చాలా ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు పొట్టిమామ, అలాగే నటి మరియు నిర్మాత రోజా భారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమణ మల్లి మాట్లాడుతూ, ‘అగమ్య’ ఒక ప్రత్యేకమైన శైలిలో రూపొందుతున్న చిత్రమని, ఇది అన్ని సినిమాలకంటే భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందన్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఋషి ప్రొడక్షన్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని వెల్లడించారు
