శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం…

యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’.. దసరాకు థియేటర్లలో సందడి!
‘నయ్యి నవెల్లి’తో దసరాకు ఫ్యామిలీ ఫన్.. యామీ గౌతమ్ ఫాంటసీ కామెడీపై ఆసక్తి!
ఈ దసరా పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ‘నయ్యి నవెల్లి’ సిద్ధమవుతోంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రకటించాయి. యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథ అందించగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.
మీరట్‌లోని ఓ చలాకీ కుటుంబంలోకి కొత్తగా కోడలు అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. ఆమె రాకతో ఇంట్లో సందడి పెరుగుతుంది. అయితే ఎంతో పర్ఫెక్ట్‌గా కనిపించే తన వదిన నిజానికి ఓ మాంత్రికురాలు కావచ్చనే అనుమానం మరిదికి మొదలవుతుంది. ఆ తర్వాత ఇంట్లో చోటుచేసుకునే వింత సంఘటనలు, గందరగోళం, నవ్వులు, సాహసాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హాస్యం, ఫాంటసీ, అడ్వెంచర్‌ను కలిపిన ఈ కథకు యామీ గౌతమ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని నిర్మాతలు చెబుతున్నారు. కుటుంబమంతా కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేసేలా పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ చిత్రం 2026 అక్టోబర్ 16న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. దసరా సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ‘నయ్యి నవెల్లి’ మంచి వినోదాన్ని అందిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.
