Skip to content

దుల్కర్-పూజా ‘శ్రీ శ్రీ’ ఫారిన్ షెడ్యూల్ పూర్తి.. రిలీజ్ డేట్ త్వరలో!

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10) మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్, తొలి పాట ‘బొమ్మ బొమ్మ’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ఫారిన్ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ ఫారిన్ షెడ్యూల్‌లో తెరకెక్కించిన ఎపిసోడ్స్ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలవనున్నాయి.

మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘శ్రీ శ్రీ’ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే

సాంకేతిక బృందం:

రచన, దర్శకత్వం: రవి నెలకుదిటి

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: ఎస్.ఎల్.వి. సినిమాస్

సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా

సీఈఓ: విజయ్ కుమార్ చాగంటి

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

డీఓపీ: అనయ్ ఓం గోస్వామి

ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా

పీఆర్ఓ: వంశీ-శేఖర

తారాగణం
నటీనటులు దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే
సాంకేతిక బృందం
రచన, దర్శకత్వం రవి నెలకుదిటి
నిర్మాత సుధాకర్ చెరుకూరి
బ్యానర్ ఎస్.ఎల్.వి. సినిమాస్
సహ నిర్మాత ఇషాన్ సక్సేనా
సీఈఓ విజయ్ కుమార్ చాగంటి
సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్
డీఓపీ అనయ్ ఓం గోస్వామి
ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా
పీఆర్ఓ వంశీ-శేఖర్
Back To Top