పిల్లల చిరునవ్వే సమాజానికి నిజమైన సంపద "అనే గొప్ప భావనతో, కొండకల్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల కోసం నందమూరి…

నాసా జాతీయ పోటీల్లో మెరిసిన శ్రీ చైతన్య విద్యార్థులు!
ఇటీవల నిర్వహించిన ‘నాసా’ జాతీయ స్థాయి పోటీల్లో మెహదీపట్నం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని గురువారం పాఠశాల ఆవరణలో విజేతలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు సౌమ్యా దేవి, ఎన్. సుశ్మ విద్యార్థులకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో సాధించిన ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని, విద్యార్థులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారమే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీచైతన్య మెహదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ ఎన్. స్వాతి, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, కోఆర్డినేటర్ జనార్ధన్, డీన్ మల్లేష్, ఐపీఎల్ ఇన్‌చార్జ్ యాదగిరి, నాసా ఇన్‌చార్జ్ రత్నవేణితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు.
