Skip to content

జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ !!!

I am text block. Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

“కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “అదే నీవు అదే నేను”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. “అదే నీవు అదే నేను” సినిమా జులై 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు, ఇటీవల ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.

డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ – మా “అదే నీవు అదే నేను” సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో రూపొందించాం. కథ గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటి యూత్ ఆడియెన్స్ కు మా మూవీ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ప్రస్తుతం సొసైటీలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం. అలాంటి తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. మనం వేసే ఒక తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం. ప్రేక్షకుల ఊహకు అందకుండా మా సినిమా సాగుతుంది. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునే చిత్రమిది. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా మా సినిమాను ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ మాత్రం మామూలుగా ఉండదు. సెకండాఫ్ లో మీరు ఎక్స్ పెక్ట్ చేయని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్స్ ఉంటాయి. థియేటర్ లో మా సినిమా చూస్తున్నప్పుడు మీరు ఉలిక్కిపడటం ఖాయం. డీవోపీ జైపాల్ రెడ్డి అందించిన విజువల్స్, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, కనిష్క మ్యూజిక్ మా మూవీలో టెక్నికల్ గా హైలైట్ గా నిలుస్తాయి. దిల్ రాజు గారి చేతుల మీదుగా మా మూవీ టీజర్ రిలీజ్ చేశాం. ఆయనకు మా మూవీ టీజర్ చాలా బాగా నచ్చింది. తన బ్యానర్ లో చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని దిల్ రాజు గారు చెప్పడం హ్యాపీగా అనిపించింది. టీజర్ చూశాక ఆడియెన్స్ లో మా మూవీని థియేటర్ లో చూడాలని క్యూరియాసిటీ ఏర్పడుతుందని నమ్ముతున్నాం. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. గోవాలో సాంగ్స్ బ్యూటిపుల్ లొకేషన్స్ లో చిత్రీకరించాం. మా ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల గారు మేకింగ్ క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఒక పెద్ద సినిమాలాగే నిర్మించారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ కోసం ఒరిజినల్ సెట్ వేయించారు. టీజర్ చూసి మూవీ ఇలా ఉంటుందేమో అనుకోవద్దు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, సర్ ప్రైజింగ్ కంటెంట్ ఉంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల మాట్లాడుతూ – మా “అదే నీవు అదే నేను” సినిమాను ఎక్కడా రాజీ పడకుండా మంచి ప్రొడక్షన్ క్వాలిటీతో నిర్మించాం. చాలామంది పేరున్న ప్యాడింగ్ ఆర్టిస్టులు మా మూవీలో కీలక పాత్రల్లో నటించారు. మా మూవీ స్టోరీకి ఏం కావాలో డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్లు మూవీకి ఏం కావాలో ప్రొడక్షన్ పరంగా అవన్నీ సమకూర్చాం. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో గేటెడ్ కమ్యూనిటీ సెట్ వేశాం. ఒరిజినల్ గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ ఉన్నంత సహజంగా ఆ సెట్ ను నిర్మించాం. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జులై 31న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది, మా సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.

నటీనటులు
త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, సహర్ కృష్ణన్ తదితరులు
సాంకేతిక బృందం
ఆర్ట్ డైరెక్టర్ నార్ని శ్రీనివాస్
లిరిక్స్ పూర్ణాచారి
డైలాగ్స్ వై. అమ్మిరాజు
డీవోపీ నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్ కనిష్క
నిర్మాత కాండ్రేగుల గోవిందు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కొండల్
Back To Top