Skip to content

‘అమీర్ లోగ్’ నుంచి ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ రిలీజ్

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణ రెడ్డి సోమ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను దక్కించుకోవడం ఈ ప్రాజెక్ట్‌‌పై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు విశేష ఆదరణ లభించింది.

ఈ క్రమంలో చిత్ర బృందం “సీదా హెలికాప్టర్ షాట్” అనే పాటను విడుదల చేసింది; ఇది ఒక ‘స్ట్రీట్ ఆంథమ్’ (యువతను ఉర్రూతలూగించే గీతం)లా అనిపిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాట ప్రధాన పాత్రల మధ్య స్నేహాన్ని, వారి బంధాన్ని చూపిస్తోంది.

ఎంసి హరి రచించి, నటించిన ఈ “సీదా హెలికాప్టర్ షాట్” కుర్రాళ్లకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పాటలో స్నేహం విలువ, యువత ఆశయాలు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. విజయం సాధించాలనే తపన ఈ పాటలో కనిపిస్తుంది. “పోరాడటమే నా రక్తంలోని స్ఫూర్తి”, “యుద్ధం మొదలైనప్పుడు, ఎవరి మాట వినవద్దు” అనే లైన్స్ అలుపెరుగని దృఢ సంకల్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ పాటలో ఉపయోగించిన పదాలు, యాస చూస్తుంటే ఇదొక పక్కా లోకల్ ప్రొడక్ట్‌గా కనిపిస్తోంది.

లిరికల్ వీడియో సైతం ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ నేచురల్‌గా కనిపిస్తున్నాయి. ప్రధాన తారాగణం ఇందులో ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తోంది. హైదరబాద్ గల్లీలను కూడా అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. ఎస్‌వీకే సినిమాటోగ్రఫీ, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ అందించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం
MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్,
రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు
సాంకేతిక సిబ్బంది
బ్యానర్ అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
దర్శకుడు రమణారెడ్డి సోమ
నిర్మాత మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత మనోహర్ రెడ్డి మంచురి
విడుదల రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DOP SVK
ఎడిటర్ రోహిత్ పెనుమత్స
సంగీతం స్మరణ్ సాయి
పోస్టర్లు శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్ స్వప్నిక్ రావు
చీఫ్ AD సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ బోరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ శరత్ పోలవరపు
PRO సాయి సతీష్
Back To Top