Skip to content

‘ఒక కోర్టు కేసు’ మూవీ రివ్యూ & రేటింగ్

ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో సూర్యాన్స్, తనిష మిశ్ర, పృథ్వి, సత్య కృష్ణన్, దయానంద్ రెడ్డి, ముక్తర్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రం జులై 17న థియేటర్స్ లో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.

కథ :

టాలీవుడ్‌లో ప్రేమ, విరహం, మోసం, ప్రతీకారం అనే కాన్సెప్ట్‌లతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చాయి. కానీ, ప్రేమలో మోసపోయిన ఒక సాధారణ యువకుడు.. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, తన లవర్ పైనే కేసు పెట్టడం అనే ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని కథాంశంతో వస్తున్న చిత్రమే ‘ఒక కోర్టు కేస్’. బిజినెస్ మ్యాన్ దక్షిత్ డాక్టర్ కీర్తిని ప్రేమిస్తాడు ఒక సందర్భంలో ఇద్దరూ విడిపోతారు, ఆ తరువాత దక్షిత్ కీర్తిని ఏం చేసాడు? కీర్తిపై దక్షిత్ కేసు ఎందుకు వేసాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ :

‘ప్రతి ప్రేమికుడికి తన ప్రేమ కోసం పోరాడే హక్కు ఉంది’ అనే క్రేజీ కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. ప్రేమలో మోసపోయిన ఒక వ్యక్తి న్యాయం కోసం లీగల్‌గా ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా కథ. ముఖ్యంగా బ్రేకప్ తర్వాత జరిగే ప్రతీకారం అనే సరికొత్త కోణాన్ని ఇందులో ఫుల్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు గణేష్ పూడి.

’తనకు జరిగిన మోసానికి వ్యతిరేకంగా ఒక యువకుడు కోర్టులో చేసే పోరాటం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో సూర్యాన్స్, హీరోయిన్ తనిష మిశ్ర చాలా బాగా నటించారు, పృథ్వి, సత్య కృష్ణన్ లాయర్స్ పాత్రల్లో పోటా పోటీగా నటించి మెప్పించారు. దయానంద్ రెడ్డి, ముక్తర్, అపూర్వ వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.

కోర్టు రూమ్ డ్రామాస్ మనం చాలా చూసాం, ఈ సినిమా కూడా కోర్టు రూమ్ లో జరిగే ఆసక్తికరమైన కథంశంతో తెరాకెక్కింది, చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ సినిమాము అందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

రేటింగ్ : 3/5

Back To Top