ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి' చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ…

హీరోయిన్ నభా నటేష్ నట ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్న “నాగబంధం”
టాలెంటెడ్, బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త మూవీ “నాగబంధం”తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ నటిగా తన వెర్సటాలిటీతో అందరినీ ఆకట్టుకుంటోంది. “నాగబంధం” సినిమాలో పార్వతి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ నభా నటేష్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఒకే పాత్రలో అనేక వైవిధ్యమైన భావోద్వేగాలను పలికించడం ద్వారా నటిగా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది నభా. దయ, పట్టుదల, దిక్కారం, బలహీనత, భక్తి..ఇలా అనేక ఎమోషన్స్ ను తన నటనలో పలికించింది అందరి ప్రశంసలు అందుకుంటోందీ నాయిక.
తారలకు ఇలాంటి అవకాశం రావడం అరుదు. ఆ అవకాశాన్ని తన టాలెంట్, డెడికేషన్ తో సద్వినియోగం చేసుకుంది నభా. నాలుగు భిన్నమైన కోణాల్లో ఒకే పాత్రను పోషించి సర్ ప్రైజ్ చేసింది నభా నటేష్. అందమే కాదు ప్రతి ఎక్స్ ప్రెషన్ లో స్టోరీని ఆవిష్కరించింది నభా. నటిగా తనకున్న నిబద్దతను ప్రూవ్ చేసుకుంటూ…ప్రేక్షకుల్ని మైమరపించే నటనను కనబర్చిందీ నాయిక.
భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు అభిషేక్ నామా “నాగబంధం” చిత్రాన్ని రూపొందించారు. కిషోర్ అన్నపరెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించారు. విరాట్ కర్ణ హీరోగా నటించారు. “నాగబంధం” సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా నభా నటేష్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీగా మిగిలిపోనుంది.
