Skip to content

‘మహాకాళి’ నుంచి బిగ్ అప్‌డేట్… 125 రోజుల షూటింగ్ పూర్తి, రోహిత్ సరాఫ్ పార్ట్ కూడా కంప్లీట్!

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మహాకాళి’ చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విజయవంతంగా 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఇక షూటింగ్‌లో మరో కీలక మైలురాయిని కూడా ఈ చిత్రం చేరుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న రోహిత్ సరాఫ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. అలాగే శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఖన్నా ఇప్పటికే తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు.

ఈ చిత్రంలో మహాకాళి పాత్రలో భూమి శెట్టి నటిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మహాకాళి రూపంలో కనిపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే శుక్రాచార్యగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ కూడా భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని అత్యాధునిక సినీ సాంకేతికతతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథాలజికల్ చిత్రాల్లో ఒకటిగా ‘మహాకాళి’ రూపుదిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్డేట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుండగా, ‘మహాకాళి’ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

చిత్రం విడుదల తేదీతో పాటు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

సాంకేతిక సిబ్బంది
క్రియేటర్ ప్రశాంత్ వర్మ
సమర్పణ ఆర్కే దుగ్గల్
బ్యానర్ RKD స్టూడియోస్
నిర్మాత రివాజ్ రమేష్ దుగ్గల్
దర్శకత్వం పూజ అపర్ణ కొల్లూరు
సంగీతం స్మరణ్ సాయి
డీవోపీ సురేష్ రగతు
ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి
కాస్ట్యూమ్ డిజైనర్ శిల్పా GNS
పబ్లిసిటీ అనంత్ కంచెర్ల
PRO వంశీ-శేఖర్
మార్కెటింగ్ హాష్‌ట్యాగ్ మీడియా
Back To Top