Skip to content

పద్మశ్రీ పురస్కార గ్రహీత మురళీమోహన్‌కు తెలంగాణ గవర్నర్ అభినందనలు

హైదరాబాద్: భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నేడు హైదరాబాద్‌లోని లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మురళీమోహన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించారు. సినీ రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ మురళీమోహన్ అందించిన విశిష్ట సేవలను గవర్నర్ ప్రశంసించారు. ఈ గౌరవం ఆయన చేసిన కృషికి దేశం ఇచ్చిన గుర్తింపని పేర్కొన్నారు. ఈ భేటీలో మురళీమోహన్ కుటుంబ సభ్యులు రూపా మాగంటి, బి.ఎస్. రావు కూడా పాల్గొన్నారు. ఈ మర్యాదపూర్వక సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగింది.

చిత్రంలో కుటుంబ సభ్యులు శ్రీమతి రూపా మాగంటి, శ్రీ బి.యస్.రావు కూడా ఉన్నారు.

Back To Top