అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని…

ఘనంగా మహేష్ కాంపెల్లి ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ లాంచ్
మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథనంతో తెరకెక్కుతోంది. “ది పాయింట్ ఆఫ్ వ్యూ” అనే ట్యాగ్‌లైన్‌నే కథలోని ప్రధాన అంశాన్ని ప్రతిబింబిస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా…
*నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ..* “మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. దాదాపు పదేళ్ల క్రితం మహేష్ ఈ కథను నాకు వినిపించారు. ఒక మహిళా ప్రధాన కథతో మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. నా తొలి నిర్మాణంతో ఇద్దరు తెలుగు హీరోయిన్లను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. సినిమా రంగం నాకు కొత్త అయినప్పటికీ మహేష్ ప్రతి విషయంలో నాకు అండగా నిలిచారు. మా హీరోయిన్లు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు” అన్నారు.
*హీరోయిన్ సోనియా నాయుడు మాట్లాడుతూ..* “అందరికీ నమస్కారం. స్టేజ్‌పై మాట్లాడటం ఇదే మొదటిసారి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్య గారికి, మహేష్ గారికి ధన్యవాదాలు. షూటింగ్ మొత్తం మహేష్ సర్ ఎంతో సపోర్టివ్‌గా ఉండేవారు. నా సహనటి పూజా రెడ్డి, సంగీత విభాగం, సినిమాటోగ్రఫీ టీమ్ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
*హీరోయిన్ పూజా రెడ్డి మాట్లాడుతూ..* “మా టీజర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మహేష్ గారు కథ చెప్పిన వెంటనే ఇది నాకు మంచి అవకాశం అని భావించాను. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు. మా టీజర్‌ను ఆదరించినట్లే సినిమా విడుదలైన తర్వాత కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
*దర్శకుడు మహేష్ కాంపెల్లి మాట్లాడుతూ..* “ఇది నా తొలి దర్శకత్వ చిత్రం. నేను ఇంతకుముందు ఏ దర్శకుడి దగ్గరా పని చేయలేదని నిర్మాత సత్య గారికి ముందే చెప్పాను. అయినప్పటికీ నేను రాసుకున్న కథపై పూర్తి నమ్మకం ఉంది. దిశ ఘటనతో పాటు కొన్ని వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ కథ ద్వారా మహిళల పట్ల సమాజంలో అవగాహన పెంచే బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
*అన్విధ్ మాట్లాడుతూ..* “ఈ చిత్రంలో కీలక పాత్ర ఇచ్చిన సత్య గారికి, మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సినిమాకు అండగా నిలుస్తున్న మీడియా, నా కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు” అన్నారు.
*సాగర్ మాట్లాడుతూ..* “మా కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. దర్శకుడు మహేష్ ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తారని నమ్ముతున్నాను. మా హీరోయిన్లు పూజా రెడ్డి, సోనియా నాయుడు అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి కష్టపడ్డ నిర్మాతతో పాటు సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు” అన్నారు.
*సంగీత దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ..* “ఈ సినిమాను ఇంతవరకు తీసుకొచ్చిన నిర్మాత సత్య గారికి, దర్శకుడు మహేష్ గారికి అభినందనలు. వారి కష్టం తప్పకుండా ఫలిస్తుంది. ఈ చిత్రంలో మంగ్లీ, హారిణి అద్భుతమైన పాటలు పాడారు. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
*నటుడు సమీర్ మాట్లాడుతూ..* “మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఒక కొత్త కోణంలో, విభిన్నమైన అంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రతి నటీనటుడు ఎంతో అద్భుతంగా నటించారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు అండగా నిలిచిన నిర్మాతకు నా వందనం. అలాగే తండ్రి మరణించిన రోజునే షూటింగ్‌కు వచ్చి పనిచేసిన సాగర్ అంకితభావం నన్ను ఎంతో కదిలించింది. మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అన్నారు.
*రంగారావు చౌదరి మాట్లాడుతూ..* “ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలో మీడియా సహకారం ఎంతో అవసరం. నిర్మాత, దర్శకులకు నా అభినందనలు” అన్నారు.
*దర్శకుడు సాయి మాట్లాడుతూ..* “మొదటి రోజు నుంచి ఈ సినిమా ప్రయాణంలో నేను భాగమయ్యాను. టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. మహిళా ప్రధాన కథతో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్లు, ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. ‘వ్యూ’ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అన్నారు.
*మూసా అలీ ఖాన్ మాట్లాడుతూ..* “మా సినిమాకు మద్దతుగా నిలుస్తున్న మీడియాకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లి నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇది మహిళా ప్రధాన చిత్రమైనప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అన్నారు.

| నటీనటులు | |
|---|---|
| సోనియా నాయుడు, పూజా రెడ్డి, సమీర్, సాగర్ తదితరులు. | |
| సాంకేతిక నిపుణులు | |
| కథ, దర్శకత్వం | మహేష్ కాంపెల్లి |
| నిర్మాత | సత్య చౌదరి |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | లక్ష్మీ నారాయణ |
| సమర్పణ | కార్తికేయ |
| బ్యానర్ | పరవాణి చలనచిత్ర |
| సంగీతం | అర్జున్ |
| నేపథ్య సంగీతం | శరవణ |
| ఛాయాగ్రహణం | ధర్మ జి జి |
| ఎడిటర్ | లక్ష్మి |
| పీఆర్ఓ | దినేష్ కె |
