Skip to content

ప్రేక్షకుల ఆశీర్వాదంతో ‘రావు బహదూర్’ ఘన విజయం సాధించింది: సక్సెస్ మీట్‌లో హీరో సత్యదేవ్

శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సత్య దేవ్, దీపా థామస్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 3న రిలీజ్ చేశారు. సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను శనివారం నాడు నిర్వహించారు. ఈమేరకు విజయోత్సవ వేడుకలో..

*సత్య దేవ్ మాట్లాడుతూ* .. ‘ప్రమోషన్స్ టైంలో ఎవరైనా సరే సినిమా గురించి ఎక్కువగానే చెబుతుంటారు. కానీ మేం మాత్రం మూవీకి పని చేసినప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. అదే ఫీలింగ్‌నే నేను ప్రమోషన్స్‌లో మాట్లాడాను. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మా ‘రావు బహదూర్’ తెలుగు సినిమాకు ప్రతినిధిగా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఆడియెన్స్ కూడా అదే అంటున్నారు. నేను ప్రతీ సినిమాకి ఇంతే కష్టపడ్డాను. కానీ చాలా వరకు నిరాశే ఎదురైంది. సక్సెస్ అనేది నాకు కొత్త. ‘రావు బహదూర్’తో నాకు సక్సెస్ వచ్చింది అని వినడం కంటే.. ఈ మూవీని చూడకపోతే ఆడియెన్స్ ఏదో కోల్పోతారని అనుకున్నాను. ఇలాంటి సినిమా ఆడాలని నేను కోరుకున్నాను. అనురాగ్, శరత్ అయితేనే మూవీని ముందుకు తీసుకు వెళ్తారని నమ్మాను. నేను ఈ కథనే చాలా మంది హీరోలకు రికమండ్ చేశాను. ఇప్పుడు ప్రేక్షకులు మా చిత్రాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అమెరికన్స్ ఈ సినిమా గురించి అడుగుతున్నారు. ఇలాంటి ఓ గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

*వెంకటేష్ మహా మాట్లాడుతూ* .. ‘‘రావు బహదూర్’ కథను సత్య దేవ్ నమ్మాడు. ఈ సినిమాని అనురాగ్, శరత్‌లు నమ్మడం వల్లే ఇంత వరకు వచ్చింది. వారి వల్లే మూవీ ఈ స్థాయికి వచ్చింది. మేం నమ్మి వేసిన ప్రతీ అడుగు విజయ తీరానికి చేర్చింది. నమ్రత మేడంకి నెరేషన్ ఇచ్చాం. ఆమెకు మేం చెప్పిన కథ చాలా నచ్చింది. మహేష్ బాబు గారికి నచ్చడం, అనురాగ్ శరత్‌లను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకు రావడం, చింతా గోపాల్ కృష్ణ గారు రావడంతో మరింత బలం వచ్చింది. గోపాలకృష్ణా రెడ్డి గారికి కథ చెప్తే ఆనందంతో బయటకు వస్తారు. ఈశ్వరన్ నాకు ఓ మంచి మెసెజ్ పంపించారు. సత్య దేవ్, దీపా థామస్, వికాస్, ప్రణయ్, బాలా మేడం, కునాల్ కౌశిక్, చాణక్య తేజ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. నేను ఏ కథ రాసిన కూడా సత్యకి నప్పుతుంది. ఈ ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నంత కాలం సత్యతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. దీపా థామస్ పర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయాను. వీరందరి సహకారంతోనే ఇక్కడి వరకు రాగలిగాను. ‘కేరాఫ్ కంచరపాలెం’లో గడ్డం పాత్ర కోసం వికాస్‌ని అనుకున్నాను. కానీ అప్పుడు కుదర్లేదు. ఆచారి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మా మూవీ మీద వ్యాసాలు రాస్తున్నారు. ఇంతకంటే నాకు ఏం కావాలి. నా డైరెక్షన్ టీంకు థాంక్స్. నాకు సమస్య వస్తే దినేష్‌ దగ్గరకే వెళ్తాను. నా డీఓపీ కార్తిక్‌తో వర్క్‌ని మిస్ అవుతుంటాను. స్మరణ్ నా ఏఆర్ రెహమాన్. శిల్పా చేసిన కాస్ట్యూమ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మా మూవీని సెలెబ్రేట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

*చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘రావు బహదూర్’ సినిమాకి సపోర్ట్ చేసిన మహేష్ బాబు గారికి, నమ్రత గారికి థాంక్స్. మీడియా కూడా మాకు సపోర్ట్ చేస్తోంది. మా కష్టాన్ని, మా మూవీని మీడియానే ఆడియెన్స్ వరకు రీచ్ చేసింది. మా కెప్టెన్ వెంకటేష్ మహా గారు ఇలాంటి గొప్ప మూవీని నిర్మించే అవకాశాన్ని నాకు ఇచ్చారు. మా శ్రమని ఆడియెన్స్ గుర్తించారు. అందరూ మా మూవీని మెచ్చుకుంటున్నారు. ఓ నిర్మాతకు ఇంతకంటే ఏం కావాలి. మమ్మల్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

*నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ* .. ‘మహా అన్నని నాకు పరిచయం చేసిన దినేష్ అన్నకి థాంక్స్. అనురాగ్, శరత్ నుంచి చాలా నేర్చుకున్నాను. సత్య దేవ్, దీపా గారికి థాంక్స్. మళ్లీ మళ్లీ సినిమాని చూస్తుంటే ఇంకా ఇంకా డీటైలింగ్స్ అర్థం అవుతుంటాయి’ అని అన్నారు.

*శరత్ చంద్ర మాట్లాడుతూ* .. ‘‘రావు బహదూర్’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా స్టార్టింగ్‌లో కొంచెం అటూ ఇటూ రెస్పాన్స్ వచ్చింది. కానీ చివరకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లెటర్ బాక్సులో సినిమా గురించి లెటర్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యాసాలు రాస్తున్నారు. థియేటర్లో జనాలు ఎన్నో థియరీలు మాట్లాడుకుంటున్నారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మా మూవీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా థీమ్‌ని జనాలు అర్థం చేసుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అందరికీ కంగ్రాట్స్. సత్య దేవ్ గారికి ఇదే మా గిఫ్ట్. టెక్నికల్లీ బాగుంది. ఎమోషనల్‌గా బాగుంది. సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు’ అని అన్నారు.

*అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘‘రావు బహదూర్’ సినిమాకి అన్ని రకాల రివ్యూలు వస్తున్నాయి. హాలివుడ్ రిపోర్టర్‌లో మూవీ గురించి అద్భుతంగా చెప్పారు. చిత్రంలోని డెప్త్ గురించి గొప్పగా మాట్లాడారు. అసలు మహా ఈ కథను ఎలా చెప్పి ఒప్పించారని సుకుమార్ గారు కూడా అడిగారు. మహేష్ బాబు గారు కూడా మెచ్చుకున్నారు. ఇలానే మా చిత్రం గురించి అందరూ మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. ఇలానే ఇండియా వైడ్‌గా మా మూవీ వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*దీపా థామస్ మాట్లాడుతూ* .. ‘నేను ఎక్కడకు వెళ్లినా సరే ‘రావు బహదూర్’ అనే గొప్ప చిత్రంలో పని చేశానని గర్వంగా చెప్పుకుంటాను. ఇలాంటి ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సత్య దేవ్ లాంటి నటుడితో పని చేయడం ఆనందంగా ఉంది. అన్ని అవార్డులు సత్య దేవ్‌కి వస్తాయని ఆశిస్తున్నాను. ఇంత గొప్పగా తీసిన వెంకటేష్ మహా గారికి అవార్డు వస్తుందని నమ్మకంగా చెబుతున్నాను’ అని అన్నారు.

*మధు శాలిని మాట్లాడుతూ* .. ‘‘రావు బహదూర్’ సినిమాని నేను చూశాను. ఓ ఆడియెన్‌గా ఎంతో ఎంజాయ్ చేశాను. ఎలాంటి అంచనాలు లేకుండా మూవీకి వచ్చాను. సత్య గారు, మహా గారిని చూసి చిత్రానికి వచ్చాను. మొదట్లో కొంత అర్థం కాలేదు.. కానీ అలా వెళ్తూ ఉంటే.. సినిమాలో లీనమయ్యాను. ఫస్ట్ హాఫ్ తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ ఆ ప్రశ్నలకు సెకండాఫ్‌లో సమాధానాలు ఉంటాయి. ఇంటికి వెళ్లి సినిమా గురించి ఆలోచిస్తే ఇంకెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఓపిగ్గా చూస్తే కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

తారాగణం & సాంకేతిక బృందం
తారాగణం సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు.
సమర్పణ GMB ఎంటర్‌టైన్‌మెంట్
బ్యానర్లు శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్
నిర్మాతలు చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
రచయిత, దర్శకుడు & ఎడిటర్ వెంకటేష్ మహా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ యాదవ్ బొల్లెబోయిన
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పర్మార్
సంగీతం స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్
కాస్ట్యూమ్ డిజైనర్ శిల్పా GNS
సౌండ్ డిజైనర్ అశ్విన్ రాజశేఖర్
సౌండ్ మిక్సింగ్ అరవింద్ మీనన్
DI శ్రీప్రసాద్ సాహూ
VFX సూపర్‌వైజర్ రామ్‌జీ డాట్
పబ్లిసిటీ డిజైనర్ ఎల్లో టూత్స్
మార్కెటింగ్ ఫస్ట్ షో
PRO వంశీ-శేఖర్
Back To Top