Skip to content

మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో శనివారం ఫాదర్స్ డే (పితృ దినోత్సవం)ను ప్రీ-ప్రైమరీ విభాగం ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తండ్రులతో కలిసి పాల్గొని ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, సరదా ఆటలతో సందడి చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ-ప్రిన్సిపల్ ఎన్. స్వాతి మాట్లాడుతూ.. కుటుంబంలో తండ్రి పాత్ర ఎంతో విలువైనదని, పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడే నాన్నకు గౌరవం తెలిపే ఉద్దేశంతోనే ఫాదర్స్ డేను జరుపుకుంటామని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రేమ, త్యాగాలను గుర్తిస్తూ వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం తండ్రులు, చిన్నారులు కలిసి నిర్వహించిన పలు వినోదాత్మక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో కోఆర్డినేటర్ పుష్పాంజలి, ప్రీ-ప్రైమరీ ఇన్‌చార్జ్ పుష్ప, పీఈటీ అనిత, ఉపాధ్యాయులు సంగీత, శ్రీవిద్యతో పాటు విద్యార్థులు, వారి తండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Back To Top