'నాగబంధం' సినిమా రివ్యూ : భారీ విజువల్ ఫాంటసీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకర్షిస్తుంటాయి. అలాంటి ప్రయత్నంగానే దర్శకుడు…

బాలన్ – ది బాయ్’పై ప్రశంసలు కురిపించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం!
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ “బాలన్ – ది బాయ్”. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవలే ఈ సినిమా హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. “బాలన్ – ది బాయ్” సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది.
ఈ సినిమా తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హీరో నాగచైతన్యతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు “బాలన్ – ది బాయ్” సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. మలయాళంలో డైరెక్టర్ ప్రియదర్శన్ అప్రిషియేట్ చేశారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక దంపతుల ప్రశంసలు అందుకుందీ మూవీ. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం “బాలన్ – ది బాయ్” సినిమాపై ప్రశంసలు కురిపించారు.
“బాలన్ – ది బాయ్” సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రాన్ని తిలకించారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను, నటీనటుల పర్ ఫార్మెన్స్ ను మణిరత్నం అభినందించారు. మణిరత్నం ప్రశంసలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించారు. ఇండియన్ సినిమా గర్వించే దర్శకుడు మణిరత్నం నుంచి తమ సినిమాకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని “బాలన్ – ది బాయ్” టీమ్ తెలిపారు.

| నటీనటులు | |
|---|---|
| ఆదిశేషన్, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, టొవినో థామస్, గిరీష్ ఎ.డి., జీన్ పాల్ లాల్ తదితరులు | |
| టెక్నికల్ టీమ్ | |
| దర్శకత్వం | చిదంబరం |
| రచన | జితూ మాధవన్ |
| నిర్మాతలు | వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ |
| డీవోపీ (DOP) | షైజు ఖాలిద్ |
| ఎడిటర్ | వివేక్ హర్షన్ |
| మ్యూజిక్ | సుషిన్ శ్యామ్ |
| పీఆర్ఓ | సురేష్ (ఎస్ కె మీడియా) |
