Skip to content

రానా స్పిరిట్ మీడియా చేతుల్లో ‘అమీర్ లోగ్’.. భారీ విడుదలకు సిద్ధం

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన అవ్వల్ దావత్ సాంగ్, టీజర్ ఇలా అన్నీ బజ్‌ను క్రియేట్ చేశాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ చిత్రంగా రాబోతోంది ‘అమీర్ లోగ్’.

రానా ‘స్పిరిట్ మీడియా’ ఈ ‘అమీర్ లోగ్’ మూవీ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని స్పిరిట్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది. ఈ చిత్రాన్ని చూసి.. అందులోని కంటెంట్ నచ్చి.. రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ గల్లీలోని ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ, వారి ప్రయాణాన్ని, యూత్‌కి ఇచ్చే సందేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అందుకే స్పిరిట్ మీడియా ‘అమీర్ లోగ్‌’ను విడుదల చేయబోతోంది.

నటీనటులు
ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి తదితరులు.
సాంకేతిక బృందం
దర్శకుడు రమణ రెడ్డి సోమ
నిర్మాత మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత మనోహర్ రెడ్డి మంచూరి
విడుదల రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
ఛాయాగ్రాహకుడు (DoP) ఎస్‌వీకే (SVK)
ఎడిటర్ రోహిత్ పెనుమత్స
సంగీతం స్మరణ్ సాయి
పోస్టర్స్ డిజైన్ శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్ స్వప్నిక్ రావు
చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ బొరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ శరత్ పోలవరపు
పీఆర్‌వో సాయి సతీష్
Back To Top