జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’…

ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాలోని ‘క్రష్..’ సాంగ్ లాంచ్
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్రం నుంచి క్రష్ సాంగ్ ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో
రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ – “సమ్మర్ హాలిడేస్” సినిమాకు ఆర్నెళ్లు వర్క్ చేశాం. ఆ ఆరు నెలలు ఎలా గడిచిపోయాయో తెలియదు. అంత హ్యాపీగా టీమ్ అంతా ఈ మూవీకి పనిచేశాం. రీసెంట్ గా టీజర్ రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు క్రష్ సాంగ్ పెద్ద హిట్ అవుతుందనే వైబ్స్ కనిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాం. అన్నారు.
లిరిసిస్ట్ కిట్టూ విస్సాప్రగడ మాట్లాడుతూ – ఈ సినిమాకు మేమంతా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. కొన్ని పాటలు మన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. కానీ ఈ పాట మన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అంత బాగా ఈ పాటను కంపోజ్ చేశారు. మీకు నచ్చిన వారికి ఈ పాట షేర్ చేసి వారితో కలిసి ఈ పాట వినమని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ మాట్లాడుతూ – “సమ్మర్ హాలిడేస్” కథను డైరెక్టర్ శ్రీకర్ చెప్పినప్పుడు నాకు నా కథ గుర్తొచ్చింది. అంత బాగా మూవీకి కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాకు సింజిత్ ఛాట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ బాగుంటాయి. అన్నారు.
ప్రొడ్యూసరి గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ – మా మూవీలో క్రష్ పాట చాలా బాగా వచ్చింది. ఈ పాటను అందంగా కంపోజ్ చేసిన సింజిత్ కు, ఆకట్టుకునేలా పాడిన అనురాగ్ కులకర్ణికి, మంచి సాహిత్యం అందించిన కిట్టూకు థ్యాంక్స్. ఈ పాట లాగే మిగతా సాంగ్స్ అన్నీ బాగా వస్తున్నాయి. పాటల్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మూవీ కూడా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.
సింగర్ అనురాగ్ కులకర్ణి మాట్లాడుతూ – క్రష్ పాట పాడేప్పుడు పీచు మిఠాయి దగ్గర నుంచి నా బాల్యంలోని అనుభవాలు గుర్తొచ్చాయి. ఈ పాటలో దేవుడు కూడా కోరే వరం బాల్యం అనే లైన్ అద్భుతంగా రాశారు కిట్టు. ఆయన అన్ని పాటల్లో ఈ పాట ఒక మెట్టు పైనే ఉంటుంది. సింజిత్ తో కలిసి లిటిల్ హార్ట్స్ లో మంచి సాంగ్స్ పాడాను. ఇప్పుడు ఈ సాంగ్ కూడా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – మా మూవీ సాంగ్ లాంఛ్ చేసేందుకు వచ్చిన ఆనంద్, ఎస్ కేఎన్, ఆదిత్య హాసన్ కు థ్యాంక్స్. మా మూవీలో అన్ని సాంగ్స్ బాగా వచ్చాయి. పాటలే కాదు మూవీ కూడా చాలా బాగుంటుంది. ఈ పాట కోసం కిట్టు రాసిన కొన్ని లైన్స్ బాగా గుర్తుండిపోతాయి. అనురాగ్ చాలా బాగా సాంగ్ పాడాడు. అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ – మా టీమ్ అంతా కలిసి ఈ పాటను అందంగా డిజైన్ చేశాం. ఒకప్పుడు ఇళయరాజా, మణిశర్మ లా ఇప్పుడు సింజిత్ ఎరా సాగుతోంది. లిటిల్ హార్ట్స్ మూవీతో బ్యూటిఫుల్ మెమొరీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సాంగ్ కూడా బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు. ఈ పాటను కిట్టునే రాయగలడు అనేంత బాగా రాశాడు. అలాగే అనురాగ్ కులకర్ణి పాడిన ఎన్నో పాటలు నా ఫేవరేట్ సాంగ్స్. ఆయన మా మూవీ సాంగ్ పాడటం హ్యాపీగా ఉంది. ఈ పాటలో నాల్టాలజీ మూవ్ మెంట్స్ ఉండాలని అనుకున్నప్పుడు కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ మాస్టర్ అందంగా కొరియోగ్రాఫ్ చేశాడు. రోహన్, ఖుషి ఈ మూవీ కోసం డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈపాట విన్న తర్వాత ధీరజ్ గారు మరింత ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ వల్లే ఇంత మంచి విజువల్స్ చేయగలిగాం. ఈపాటను ఎలా లూబ్ లో వింటారో, మా సినిమాను కూడా అలాగే రిపీటెడ్ గా చూస్తారు. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – శ్రీకర్ ఈ కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఒక మంచి మూవీ చేశామని మీ అందరితో అనిపించుకుంటాం. సింజిత్ మ్యూజిక్ చేయకుంటే ఈ పాటలు ఇంత బాగా వచ్చేవి కావేమో. ఆయన మూడు పాటలు ఛాట్ బస్టర్స్ ఇచ్చారు. కిట్టు విస్సాప్రగడ గతంలో మా సినిమాలకు వర్క్ చేశారు. ఈ పాటను అందంగా రాశారు. 800 పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు అంతే ప్యాషనేట్ గా ఈ పాట పాడారు. మేము కథను నమ్మే ఇంత ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నాం. 90 మిడిల్ క్లాస్ రూపొందించిన ఆదిత్య హాసన్, అప్పుడు రోహన్ క్యారెక్టర్ ను ఇప్పుడు ఎపిక్ మూవీలో చేస్తున్న ఆనంద్ దేవరకొండ..వీళ్లిద్దరి చేతుల మీదుగానే ఈ క్రష్ సాంగ్ రిలీజ్ చేయడం కరెక్ట్ అనిపించింది. ఆనంద్ గారితో దొరసాని, బేబి మూవీస్ చేశాం. మా కాంబోలో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా. గీతా ఆర్ట్స్ తో మా అనుబంధం ఎలా కొనసాగుతుందో ఎస్ కేఎన్ తోనూ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎగ్జామ్స్ ఉన్నా, స్కూల్స్ జరుగుతున్నా రోహన్, ఖుషి, అరుణ్ ను షూటింగ్ ఉన్నప్పుడు పంపి సపోర్ట్ చేసిన వాళ్ల పేరెంట్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్ల సపోర్ట్ లేకుండా షూటింగ్ పూర్తయ్యేది కాదు. హైదరాబాద్ , అమలాపురం..ఇలా మల్టిపుల్ లొకేషన్స్ కు తరుచూ వెళ్లి షూటింగ్ చేశాం. అన్నారు.
బాలనటి ఖుషి మాట్లాడుతూ -ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ శ్రీకర్ గారికి, ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి థ్యాంక్స్. క్రష్ సాంగ్ ను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు సింజిత్. మీ అందరికీ ఈ పాట చాలా బాగా నచ్చుతుంది. రోహన్, అరుణ్ మా మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశారు. వారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అన్నారు.
బాలనటుడు రోహన్ రాయ్ మాట్లాడుతూ – సింజిత్ అన్న మా సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారని తెలిసినప్పుడు నా మొహం వెలిగిపోయింది. ఆయన సినిమాకు ఎలాంటి సాంగ్ కావాలన్నా చేసి ఇస్తారు. ఈ సినిమాలో పాటలు మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పగలను. మా మూవీ సాంగ్ లాంఛ్ కు ఆదిత్య అన్న, ఆనంద్ అన్న రావడం హ్యాపీగా ఉంది. ఎస్ కేఎన్ గారి స్పీచ్ లు మళ్లీ మళ్లీ వింటుంటాం. ఈ సాంగ్, ఈ మూవీ మీకు మంచి మెమొరీగా మిగిలిపోతుంది. అన్నారు.
డైరెక్టర్ ఆదిత్య హాసన్ మాట్లాడుతూ – ఈ క్రష్ సాంగ్ విన్నప్పుడు నా బాల్యంలోని స్మృతులు గుర్తుకువచ్చాయి. నేను సమ్మర్ హాలీడేస్ లో మా అమ్మమ్మ వారి ఇంటికి వెళ్లలేదు. కానీ ఈ పాట చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఈ టీమ్ మరేదైనా కథతో సినిమా చేయొచ్చు. కానీ ఒక మంచి స్టోరీతో శ్రీకర్ ఈ సినిమా రూపొందిస్తున్నాడు. ఆయనలోని ఎమోషన్ ను ఈ మూవీతో చూపిస్తున్నాడు. ధీరజ్ గారి సినిమాలు మంచి కంటెంట్ తో వస్తాయి. ఈ సినిమా కూడా ఆయనకు ఒక సక్సెస్ ఫుల్ మూవీ కావాలి. సింజిత్ ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తాడు. కిట్టు లిటిల్ హార్ట్స్ మూవీకి రాసిన సాంగ్స్ నాకు బాగా ఇష్టం. రోహన్ నాలా ఉంటాడని 90 మిడిల్ క్లాస్ బయోపిక్ లో తీసుకున్నా. అతను మంచి పర్ ఫార్మర్. ఖుషి, రోహన్ కూడా ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకోవాలి. సమ్మర్ హాలీడేస్ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – చిన్నప్పుడు చిన్నారి చేతన్, బాల భారతం, లిటిల్ సోల్జర్స్ లాంటి మూవీస్ చూసి ఎంజాయ్ చేసేవాళ్లం. కొన్నేళ్ల తర్వాత బాలల చిత్రాలు రావడం తగ్గిపోయింది. మా ధీరజ్ ఆ జానర్ లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ పాటను కొన్ని రోజుల క్రితం ధీరజ్ వినిపించాడు. చాలా బాగుంది. లిటిల్ హార్ట్స్ కు సింజిత్ చేసిన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ మూవీకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను అందంగా పాడారు. 90 సిరీస్ లో రోహన్ చేసిన సీన్స్ రిపీటెడ్ గా చూస్తుంటా. అతనితో పాటు ఖుషికి, అరుణ్ కు ఈ సినిమాతో మంచి పేరు రావాలి. డైరెక్టర్ శ్రీకర్ మంచి సబ్జెక్ట్ తీసుకుని ఈ సినిమా రూపొందించాడు. ధీరజ్ అంబాజీపేట, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తున్నాడు. అలాగే డీజే టిల్లు, బేబి, చెన్నై లవ్ స్టోరీ లాంటి చాలా చిత్రాల్లో పార్టనర్ గా ఉంటూ వస్తున్నారు. పిల్లల సినిమా అంటే ఆడియోకు పెద్దగా క్రేజ్ ఉండదు. కానీ థింక్ మ్యూజిక్ వాళ్లు మరో ఆలోచన లేకుండా వచ్చి ఈ మూవీ సాంగ్స్ తీసుకున్నారు. నా బ్రదర్ ఆనంద్ కు ఎపిక్ మూవీ పెద్ద హిట్ ఇవ్వాలి. ఆనంద్, ధీరజ్ ఏ సినిమా చేసినా అది నా సినిమాలాగే భావిస్తా. క్రష్ అంటే పర్సన్ ని కాదు కెరీర్ ను పెట్టుకోండి. కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే. చదువుకుంటూ కూడా ఈ పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్లు ఎంత ఫోకస్డ్ గా ఉన్నారో తెలుస్తోంది. ఈ వేదిక మీద క్యాసెట్ లాంఛ్ చేస్తుంటే నా జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ధీరజ్ కు సమ్మర్ హాలీడేస్ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – ఈ సినిమా టీజర్ చూసినప్పుడు ఎమోషనల్ ఫీల్ తో పాటు ఆనందభాష్పాలు కూడా వచ్చాయి. ఒక మంచి మూవీ చేశారని అప్పుడే అనిపించింది. ఈ సినిమా టీమ్ లోని వాళ్లతో నాకు ఏదో ఒక అటాచ్ మెంట్ ఉంది. కిట్టు, అనురాగ్ వర్క్ చేసిన నా గుంటూరు సాంగ్ లాక్ డౌన్ టైమ్ లో వైరల్ అయ్యింది. నాకు మొదట పేరు తెచ్చిన నింగిలోని పాలపుంత పాటను పాడింది అనురాగ్. అలాగే నా ఫస్ట్ మూవీని కో ప్రొడ్యూస్ చేసింది ధీరజ్. ఈ పోస్టర్ చూస్తుంటే ధీరజ్ ఏదో సినిమా చేశామని కాకుండా ఆయన గత చిత్రాలు అంబాజీపేట.., ది గర్ల్ ఫ్రెండ్ లా మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులతో సాలిడ్ సెటప్ తో సినిమా చేశాడని అర్థమవుతోంది. లిటిల్ హార్ట్స్ విజయంలో సింజిత్ మ్యూజిక్ ది కీలక పాత్ర. అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. 90 వెబ్ సిరీస్ లో రోహన్ సూపర్బ్ గా యాక్ట్ చేశాడు. నేను అతని క్యారెక్టర్ పెద్దయ్యి విదేశాలకు వెళ్లి చదువుకుంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఎపిక్ మూవీ చేస్తున్నా. రోహన్ యాక్టింగ్ ఎపిక్ మూవీలో నటించడానికి నాకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ చిత్రంలోని పిల్లల నటన చూసి మరింతమందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని ఆశిస్తున్నా. జూలైలోనే బేబి రిలీజైంది. ఈ జూలైలోనే వస్తున్న చెన్నై లవ్ స్టోరీ కూడా అలాంటి పెద్ద విజయాన్ని ఎస్ కేఎన్ కు ఇతర టీమ్ కు అందించాలని కోరుకుంటున్నా. బేబి మూవీలో డ్యాన్సర్ గా చేసిన లక్ష్మణ్ ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేశారు. రోజులు గడుస్తుంటే అందరి జర్నీ చాలా బాగుంది. డైరెక్టర్ శ్రీకర్ మంచి సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నారు. సమ్మర్ హాలీడేస్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
