Skip to content

నా జీవితం ఒక తెల్లకాగితం ఎక్కడా ఒక మచ్చ కూడా పడనివ్వను- మురళీమోహన్‌

మాగంటి మురళీ మోహన్‌ … తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారుండరు. ఆయన అసలు పేరు రాజాబాబు. కానీ మురళీ మోహన్ గానే  ప్రేక్షకులకు పరిచయం..ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఆయన తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.. హీరోగా ,సహాయ నటుడిగా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆయన నటించిన సినిమాల్లో కుటుంబ విలువలకు పెద్దపీట వేయడం వల్ల మహిళా ప్రేక్షకులు ఆయనను బాగా ఆదరించారు. చిన్న నిర్మాతల హీరోగా ఎదిగారు. తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు పొందిన అతికొద్ది మందిలో మురళీ మోహన్ ఒకరు.

నిర్మాతగా ఆయన స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలకు వేదికైంది. ఈ సంస్థ ద్వారా ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాయి. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఫిలిం ఛాంబర్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల జె.వి. ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్‌కొండేటి కలిసి బొకేను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌..ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ.. పాత్రికేయ కుటుంబంతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన క్రమశిక్షణ జీవితం గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయనకు అవార్డు వరించిన సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ వారు పిలవగానే వచ్చినందకు చాలా ఆనందంగా ఉంది. 1940 జూన్‌ 24వ తారుఖున జన్మించారు. ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజీలో చదువుకున్నారు. బుద్ధిమంతుడు అనే మార్కులు ఉన్నాయి. హీరో కృష్ణగారు, ఈయన క్లాస్‌మేట్స్‌. చదువు పెద్దగా అబ్బలేదు. చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి బిజినెస్‌ మైండ్‌ తో ఉండేవారు. నేను కూడా ఒక బిజినెస్‌ మేన్‌ కావాలని అనుకున్నారు. చదువు కంటే కూడా క్యారెక్టర్‌ మీద మచ్చ లేకుండా ఉన్న వ్యక్తి ఆయన. వెయ్యిమంది స్టూడెంట్స్‌ని ఒక్కో విద్యార్ధి మీద 5లక్షలు ఖర్చు పెట్టి చదివించారు. వెయ్యి మంది కుటుంబాలలో వెలుగు నింపిన మనిషి మురళీమోహన్‌. మురళీమోహన్‌గారి సహాయంతో చదువుకుని రిజర్వ్‌ బ్యాంక్‌లో పని చేస్తున్నారు. విద్యా దానాన్ని మించిన గొప్ప దానం లేదు అన్నారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళారు. గెలిచి ఓడిన ఎమ్‌.పీ.గా ఆయన ఉండిపోయారు. కొద్ది క్షణాల్లో రిజల్ట్‌ మారిపోయింది. ఏ నియోజకవర్గంలో ఓడిపోయారో అందులోనే తిరిగి గెలిచారు. ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే… ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాము మీరు ఏమి చెయ్యదలుచుకున్నారో అది చెయ్యండి నాన్న అన్నారు. అంత గొప్ప సంతానం మురళీమోహన్‌గారి పిల్లలు. ఇటీవలె ఆయన 86వ జన్మదినం చేసుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలె ఆ చిత్ర షూటింగ్‌ రమడ హోటల్‌లో జరిగింది. మన నోట్లోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్‌ చేస్తే..మన నోటి నుంచి వచ్చే మాట మన క్యారెక్టర్‌ని డిసైడ్‌ చేస్తుంది అంటారు. అనారోగ్య ధోరణికి టాలీవుడ్‌ మీడియా ఎప్పుడూ పాల్పడలేదు. టాలీవుడ్‌లో ఎప్పుడూ కూడా ఎల్లో జర్నలిజం అన్నదే లేదు. ఫిలిం క్రిటిక్స్‌ నిర్వహించే నూతన కమిటీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళు నిర్వహించే ప్రుతీ కార్యక్రమం అద్భుతం అని చెప్పాలి. మురళీ మోహన్‌గారి అసలు పేరు రాజారామ్మోహన్‌రాయ్‌… ఆయన తమ్ముడు వేణుగోపాల్‌ తిలక్‌ అని పెట్టారు. మురళీమోహన్‌గారి జీవితగాధను పుస్తకరూపంలో వస్తే బావుంటుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ బాధ్యతను కూడా నేనే తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఆయన జీవిత చరిత్రను రాస్తాను. ఈ ఏడాది చివరి వరకు ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తాను.

మురళీ మోహన్‌ మాట్లాడుతూ… ఎన్నో సందర్భాల్లో మేము ప్రెస్‌ మీట్లు పెట్టాము పాత్రికేయులు వచ్చేవారు. మా సినిమాల గురించి రాసేవారు. చాలా చక్కటి కవరేజ్‌ ఇచ్చేవారు. ఎప్పుడూ కూడా నెగిటివిటీ రాసేవారు కాదు. అంతా మంచిగా రాసేవారు. ఫిలిం ఇండస్ట్రీకి ఫిలిం క్రిటిక్స్‌కి ఎప్పటి నుంచో కొంత అనుబంధాలు ఉన్నాయి. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదు. ఏ భాషలోనైనా క్రిటిక్స్‌కి ఇండస్ట్రీకి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. క్రిటిక్స్‌ వారు పిలిచి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంది నన్ను అవార్డు వచ్చాక పిలిచారు. కానీ ముందుగా క్రిటిక్స్‌ చేసిన తరువాత అనుకున్నా. చాలా ఇండస్ట్రీల్లో ఎల్లో జర్నలిజం. ఉంటుంది. ఎల్లో జర్నలిజం లేనిది ఏదైనా ఉందంటే అది కేవలం టాలీవుడ్‌లోనే అని గట్టిగా చెప్పగలను. టాలీవుడ్‌లో జర్నలిస్టులు హీరోలు మధ్య స్నేహ బంధం ఉంటుంది. నేను హీరో అని ఎవ్వరూ ఫీలవ్వరు అందరూ ఫ్రెండ్స్‌ లా ఉంటారు. చిరంజీవిగారు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. చెడు ఉంటే చెవిలో చెప్పండి. మంచి ఉంటే మైకులో చెప్పండి అని. అలా ఎప్పుడూ చెడు చెప్పలేదు. ఎంత మంది ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా అది కేవలం వారికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఫిలిం క్రిటిక్స్‌ చేస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా వెళుతుంది. అలాంటి కార్యక్రమం ఇది. అప్పట్లో మా ఊరిలో చాలా మంది స్వాతంత్య్ర సమయరయోధులు ఉన్నారు. గాంధీగారికి మానసపుత్రిక కూడా మా ఊరిలోనే ఉండేవారు. నాకు పెద్దగా చదువు ఎందుకో ఒంటబట్టేది కాదు. అప్పట్లో వ్యాపారం చేద్దామంటే.. డబ్బులు లేవు. ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు. నా జీవితంలో మొదటి మలుపు గుప్త మాణిక్యాలరావుగారు అలాగే అట్లూరి పూర్ణచంద్రరావుగారు మార్చారు. పూర్ణచంద్రరావుగారు నన్ను చూసి హీరోగా అనుకున్నారు. గిరిబాబుని మొదట హీరోగా అనుకున్నారు. నన్ను చూడగానే ఆయనను విలన్‌గా చేశారు. జగమేమాయ అనే సినిమాతో హీరోగా నన్ను పరిచయం చేశారు. ఆయన దాదాపుగా 87 చిత్రాలు చేశారు. 13 భాషల్లో చేసిన ఘనత ఉంది. ఓ రోజు మీ పేరు మారిస్తే బావుంటుంది అనుకుంటున్నాను అన్నారు. నా పేరు రాజబాబు అన్నాను. ఆల్రెడీ ఉన్నారు ఆ పేరు కాబట్టి మోహన్‌ అని పెట్టారు. ఆంధ్రపత్రిక శ్రీనివాస్‌గారు మోహన్‌ అనేది పూర్తి పేరు లేదు అన్నారు. మురళీ అని యాడ్‌ చేయమంటే… పూర్ణయందర్‌రావుగారు మురళీ మోహన్‌గా మార్చారు. ఆయన పెట్టిన బిక్షవల్లే నేను ఇంత ఎత్తుకి ఎదిగాను. దాసరి నారాయణరావుగారిని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను . దాదాపుగా ఆయన సినిమాలన్నిటిలో చేశాను. ఓ రోజు శోభన్‌బాబు గారు మీరు సంపాదించే ప్రతీ డబ్బు ఎక్కడ పెడతారు అన్నారు. నేను సొంత బ్యానర్‌ ఉంది సినిమాలు తీస్తను అన్నాను. మంచిదే అన్నారు. తరువాత నాకు నా ప్రతి రూపాయిని కూడా అప్పు చేసి మారి నేను ల్యాండ్స్‌ కొన్నాను అన్నారు. కలను నిజం చేసే వ్యాపారం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని నేను నమ్మాను. నేను నీతిగానే చేస్తాను. నిజాయితీగానే చేస్తాను అని ఇన్నాళ్ళలో ఎక్కడా తప్పుజరగకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. ఏ ఇండస్ట్రీలో కూడా నాకు మచ్చ లేదు. శోభన్‌గాబుగారిని కూడా నేను నా జీవితంలో మర్చిపోలేను ఆ నలుగురు నాకు చేసిన సహాయం మర్చిపోలేను. నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. అలా నేను ఏదీ కూడా ప్రచారం చేసుకోలేదు. కేవలం మౌత్‌ టు మౌత్‌ వెళ్ళడం నేను సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరూ మంచితనంగా చెపుతుంటే చాలా ఆనందంగా ఉంది. మనం ఎంత ఉన్నా.. ఎంత సంపాదించినా నాలుగు మెతుకులు తప్పా ఏం తింటాం. ఇప్పటికీ నేను ఒక అపార్ట్‌మెంటులో ఉంటాను. నేను చాలా సింపుల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నాను అన్నారు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన ప్రతి ఒక్కరికీ చాలా కృతజ్ఞతలు అన్నారు.

ప్రెసిడెంట్‌ బత్తుల ప్రసాద్‌ మాట్లాడుతూ…మురళీ మోహన్‌గారి అసలు పేరు రాజాబాబు. మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఆనందంగా ఉంది. ఆయనకు అవార్డు రావడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను అన్నారు.

జనరల్‌ సెక్రటరీ సురేష్‌ కొండేటి మాట్లాడుతూ…సినిమా పాత్రికేయులు అందరూ హ్యాపీ. ఈ సన్మానికి ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ముందుండే వ్యక్తి మురళీ మోహన్‌గారు. నా విషయంలో కూడా చాలా ఎంకరేజ్‌ చేశారు. ప్రతి సందర్భంలోనూ ఆయన నా వెంట ఉన్నారు. బావున్నప్పుడు ప్రతి ఒక్కరూ వెనక ఉంటారు. నాకు వచ్చిన చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మురళీ మోహన్‌గారు ప్రతి క్షణం వెన్నంటే ఉంటూ నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేశారు అన్నారు.

వైస్‌ ప్రెసిడెంట్‌ జనార్ధన్‌ మాట్లాడుతూ… మురళీ మోహన్‌గారిని విద్య రంగంలో సినిమా రంగంలో రాజకీయరంగంలో ఇలా అన్ని రంగాల్లో చాలా మంచి అనుభవం ఉంది. పిలవగానే ఈ మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్‌ ఆయనకు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

వైస్‌ప్రెసిడెంట్‌ అబ్దుల్‌ మాట్లాడుతూ.. ఇంత చక్కటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌ ఇలాంటివి అవార్డులు మరిన్ని ఆయనకు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

సీనియర్‌ పాత్రికేయులు సుబ్బారావు మాట్లాడుతూ… మురళీ మోహన్‌గారు మంచి నటులు మంచి నిర్మాత ఇవన్నీ అందరికీ తెలిసందే. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఆనందంగా ఉంది. విద్యా దానం చేయడం చాలా ఆనందం. నేను కూడా ఒక ఇద్దరికి రికమెండ్‌ చేయడం జరిగింది. చాలా ఆనందం. ఎంతో మందిని ఆయన చదివించారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అప్పాజీ మాట్లాడుతూ.. ఆరున్నర దశాబ్దాల ఫిలిం క్రిటిక్స్‌కి మెంబర్‌ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మురళీమోహన్‌గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా అదష్టంగా భావిస్తున్నాను. మురళీమోహన్‌గారు ఒక స్ఫూర్తి ప్రదాత. ఆయనను మరిన్ని అవార్డులు వరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ బాలిరెడ్డి మాట్లాడుతూ.. పద్మశ్రీ మురళీ మోహన్‌గారికి అభినందునులు నమస్కారాలు. ఇప్పటికే లేట్‌ అయింది. కానీ ఇప్పటికైనా వచ్చింది. భారతదేశం ప్రభుత్వం గుర్తించినందుకు ఆనందం. ఆయన నాన్‌ కాంట్రవర్షియల్‌గా ఉండేవారు. రియల్‌ ఎస్టేట్‌లో కూడా ఆయనకు ఎక్కడా కాంట్రవర్సీ లేదు. ఆ తప్పు ఎక్కడా ఆయన చెయ్యలేదు. సినిమా కళాకారుడు ఒక్క సినిమాని మాత్రమే నమ్ముకోకుండా ఇతర రంగాల్లో కూడా గుర్తింపుని సాధించారు. హైదరాబాద్‌లో జయభేరి పేరు మారుమ్రోగుతుంది. ఎంతోమందికి ఆ రంగంలో కూడా ఉపాధి కల్పించారు. పద్మశ్రీరావడం చాలా ఆనందం ఆయనకు తెలుగు సినీ రంగం ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పటు చేయాలని నేను కోరుతున్నాను అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ మామిడాల గిరిధర్‌ మాట్లాడుతూ… రంపచోడవరంలో నేను మొదటి సారి ఆయనను కలిశాను. నమ్మినబంటు షూటింగ్‌లో కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నాను. దురదృష్టవశాత్తు ఆ ఇంటర్వ్యూ పబ్లిష కాలేదు. తిరిగి మళ్ళీ చినబాబు షూటింగ్‌లో ఇంటర్వ్యూ చేశాను. సితారలో వినాయకరావుగారు తీసుకెళితే ఆయన ద్వారా వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేశాను. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పర్సన్‌ని నేను చూడలేదు. ఆయన ఎవరినైనా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి మంచి మనసున్న మనిషిని సినిమా ఇండస్ట్రీలో నాకు ఎక్కడా కనిపించలేదు అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఆర్.డిఎస్‌ ప్రకాశ్‌ మాట్లాడుడూ… ఆయన పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్‌. మురళీ మోహన్‌గారు మా మంచి మురళీ మోహన్‌ అని రాస్తాను నేను. ఒకొక్కరికి ఒక్కో పేరు ఉంటుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి లాగా మా మంచి మురళీమోహన్‌ అంటారు. నా హోమియో టుడే మ్యాగజైన్‌లో అల్లూరామలింగయ్యగారి ట్రీట్‌మెంట్‌ గురించి ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు.

ప్రశ్న జవాబులు

-హైదరాబాద్‌ శోభన్‌గారు అని మంచి కామెంటు ఇచ్చారు బాలిరెడ్డిగారు. రియల్‌ ఎస్టేట్‌ మెగాస్టార్‌ మురళీమెహన్‌ అని చిరంజీవి అన్నారు. శోభన్‌గబాబుగారు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. నేను చాలా వాటికి చేస్తున్నాను. పబ్లిసిటీ చేసుకోను. నాకు ఇష్టముండదు.

• నేను సినిమా నటుడ్ని అవుతానని నామీద నాకే నమ్మకం లేదు అనుకోకుండా నటుడ్ని అయ్యాను. నేను ఆ పాత్ర చేయలేకపోయాను ఈ పాత్ర చేయలేకపోయాననే అసంతృప్తి నాకు ఎప్పుడూ లేదు. ముద్ధబంతి సినిమాలో దాసరిగారు అన్నారు నీపేరు మారుమ్రోగిపోతుంది అని కానీ అందులో తాగుబోతుగా నేను చేసిన పాత్ర చాలా మందికి నచ్చలేదు. నాగేశ్వరరావుగారి లాగా తాగబోతు క్యారెక్టర్‌ ఎవ్వరూ చేయలేరు. జీవితంలో తాగుబోతు క్యారెక్టర్‌ మాత్రం చేయకూడదు అనుకున్నాను. ఈ వయసులో నెగిటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌ చేశాను. బ్రేకింగ్‌ న్యూస్‌లో నేను హీరోగా చేశాను త్వరలో విడుదలవుతుంది.

• నా జీవితం ఒక తెల్లకాగితం ఎక్కడా ఒక మచ్చ కూడా పడలేదు. పడనివ్వను అన్నారు.

• మా అబ్బాయి నాకు సినిమాలు ఇంట్రస్ట్‌ లేదన్నారు. మా అమ్మాయిని చూస్తే నాకు యాక్టర్‌ చేయాలనుకున్నా. నిన్ను కనుక ఇండస్ట్రీకి పరిచయం చేసుంటే జయాబాధురిగా అనుకున్నాను అన్నారు. కానీ ఆమెకి కూడా పెద్ద గా ఇంట్రస్ట్‌ లేదని తెలిపారు. సినిమా ప్రొడక్షన్‌ మీద ఉన్నాయిగాని ఆర్టిస్ట్‌ అవ్వాలని అనుకోలేదని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ శ్యామ్‌ కుమార్‌, శ్రీమతి పర్వీన్‌బాబి, ట్రెజరర్‌ భరద్వాజ, ఎగ్జిక్యైటివ్‌ మెంబర్‌ చందూ రమేష్‌, కేశవచారి, నవీన్‌, కుమారస్వామి తది తరులు పాల్గొన్నారు.

Back To Top