Skip to content

‘రిస్క్’కు ప్రేక్షకుల మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన చిత్ర యూనిట్

సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్, జోయా జవేరి, రాజీవ్ కనకాల, తరుణ్ సాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రధాన పాత్రల్లో జగదీష్ కొమరి కెమెరామేన్ గా ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో ఘంటాడి కృష్ణ, గుర్రం నర్సింహులు, రావి సురేష్ రెడ్డి నిర్మించిన చిత్రం రిస్క్.

సంగీత దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం ఇచ్చిన ఘంటాడి కృష్ణ రిస్క్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 2026, జూన్ 26న విడుదల అయ్యింది . ఏ గేమ్ ఆఫ్ యూత్ అనే కాప్షన్ జోడించారు. అంతా కొత్తవారితో తీసిన సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది, ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

“రిస్క్” ( ద గేమ్ ఆఫ్ యూత్) ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న. ఇరు రాష్ట్రాల ప్రేక్షక దేవుళ్ళకు ఈ చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విడుదలై, క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది…

ఈ సందర్బంగా చిత్ర హీరో “సందీప్ అశ్వ. మాట్లాడుతూ… ‘’డెబ్యూ..హీరో అయినాసరే ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

చిత్ర దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ…‘’నా గత చిత్రాల మాదిరిగానే రిస్క్ మంచి మ్యూజికల్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదములు, ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిన ఆడియన్స్ కు స్పెషల్ థాంక్స్ తెలిపారు. అలాగే ఈ చిత్ర నిర్మాతైన రావి సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. పాజిటివ్ టాక్ తో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని చిత్రాలు నిర్మించే ధైర్యాన్నిచిందని తెలియజేశారు.

Back To Top