శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం…

సినీ నటి హేమ పొతనకు జన్మదిన శుభాకాంక్షలు
తెలుగు సినీ నటి హేమ పొతన నేడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. 2013లో మిస్ హైదరాబాద్‌గా గుర్తింపు పొందిన ఆమె, అనంతరం సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
100% లవ్ చిత్రంలో స్నేహితురాలి పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైన హేమ పొతన, మేడమ్, కొడిబుర్ర, ప్రవరాఖ్యుడు (సెకండ్ హీరోయిన్), చలాకీ, కాఫీ బార్, యూ, బావర్స్ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు.
అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్న హేమ పొతనకు ఈ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించి సినీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

