Skip to content

మౌర్య–త‌న్వి జంటగా మీరా ప్రొడ‌క్ష‌న్స్ తొలి చిత్రం ప్రారంభం

మీరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా..అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత సందీప్ రామినేని(శాండి) మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీగా రాబోతోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ గీత సి.శేఖ‌ర్‌ ఫ‌న్‌ ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. మౌర్య‌, త‌న్వి జోడీ క్యూట్‌గా మెప్పించ‌నున్నారు. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.

Back To Top