Skip to content

‘మెగా బంగారం’ మూమెంట్‌ -‘మా ఇంటి బంగారం’ టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందనలు

జూన్ 19న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది. ఇప్పుడు ఈ సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను టీమ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్ర‌మంలో వారికి వారి ఎన‌ర్జీని, ఉత్సాహాన్ని పెంచే సంఘ‌ట‌న జ‌రిగింది… అదే ‘మెగా బంగారం’ మూమెంట్. సూపర్ డూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కలెక్ష‌న్స్ రాబ‌డుతూ దూసుకెళ్తోన్న ‘మా ఇంటి బంగారం’ ఘన విజయాన్ని అభినందిస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాను చూస్తున్నంత సేపు చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించింది. జాయింట్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, ఎమోషన్స్‌ని చాలా బాగా మిక్స్ చేస్తూ డైరెక్టర్ నందినీ రెడ్డి తన స్టైల్లో సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందించారు. స‌మంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ముఖ్యంగా ఆమె చీరలో చేసిన యాక్షన్ సీన్స్ చాలా ఆకట్టుకున్నాయి. మ‌హిళ‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించే సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ విజయాన్ని సాధించిన‌ సమంత, నందినీ రెడ్డి, రాజ్, అలాగే మొత్తం టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు. అలాగే తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమంత, రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

ట్వీట్ చేయ‌టంతో పాటు చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న స‌తీమ‌ణి శ్రీమ‌తి సురేఖ ప్ర‌త్యేకంగా ఇంటికి పిలిచి అభినందించారు. మంచి సినిమాల‌కు త‌న వంతు స‌పోర్ట్‌ను అందించే మెగాస్టార్ ‘మా ఇంటి బంగారం’ సినిమా టీమ్‌ను అభినందించ‌టం ఎంతో ప్ర‌త్యేకం. ‘మెగా బంగారం’ మూమెంట్‌లో స‌మంత‌, రాజ్ నిడిమోరు, డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా తొలి ఆట నుంచే ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటూ దూసుకెళ్తోంది. సమంత చేసిన పెర్ఫార్మెన్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆమె చేసిన ఇంటెన్స్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా స‌త్తా చాటుతోంది.

హౌస్‌ఫుల్ థియేటర్లు, ఉత్సాహభరితమైన ప్రేక్షకుల స్పందన, అలాగే సోషల్ మీడియాలో వస్తోన్న సూప‌ర్బ్ రెస్పాన్స్ తో ‘మా ఇంటి బంగారం’ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా మారింది. మా ఇంటి బంగారం సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ధ‌ర్మేంద్ర కాక‌ర్ల ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Back To Top