జూన్ 19న విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్…

‘దీవాన’కు రోజు రోజుకూ పెరుగుతున్న కలెక్షన్స్ – వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఈ నెల 20న థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “దీవాన” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ గురించి ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రొడ్యూసర్స్ శ్రీదేవి కార్యంపూడి, వాసుదేవ్ కొప్పినేని.
*ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ*
– దీవాన సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కథ సెకండాఫ్ నుంచే టేకాఫ్ అవుతుంది. ఇంటర్వెల్, సెకండాఫ్ బాగా ఇంప్రెస్ అయ్యే ఈ మూవీని స్టార్ట్ చేశాం. సరదాగా ఉండే హీరో మారిపోవడం వంటివన్నీ సెకండాఫ్ లోనే చూపించాం. ఏ సర్టిఫికేషన్ వల్ల మా మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ రాలేకపోతున్నారు. ఒక మంచి మూవీ అందరికీ చేరువ కాలేకపోతోంది అనే బాధ మాత్రం మాలో ఉంది.
– మేము మూవీ ప్రమోషన్స్, మార్కెటింగ్ లో బిజీగా ఉన్నాం. అదే టైమ్ లో సెన్సార్ నుంచి ఇలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మేము రివిజన్ కు వెళ్లే టైమ్ కూడా దొరకలేదు. ఒక విజువల్ కట్ తో పాటు కొన్ని ఆడియో కట్స్ ఇచ్చారు. అవి ఇచ్చే ముందే, ఇవి మీరు తీసేస్తే ఏ సర్టిఫికెట్ ఇస్తామని అన్నారు. అంటే ముందే వాళ్లు ఏ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారు.
– మా సినిమా చూసిన ఆడియెన్స్ రివ్యూయర్స్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం రివీల్ చేయలేదు. మొదట్లో ఆ ట్విస్ట్ గురించి చెబుతారని కొంత భయం ఉండేది. కొన్ని సినిమాలు కథలోని ట్విస్ట్ మీదే ఆధారపడి ఉంటాయి. అయితే మా మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత మరింత బలమైన కథా కథనాలతో ముందుకు సాగుతుంది. హర్షిత్ మూవీ ప్రమోషన్స్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇవాళ తన ఫ్యాన్స్ తో ఒక షో బుక్ చేసుకుని వెళ్తున్నాడు. వచ్చే రెండు మూడు రోజులు కాలేజ్ విజిట్స్, థియేటర్స్ విజిట్ చేయబోతున్నాడు.
– ఈ సినిమాకు మేము డబ్బులు పెట్టడం దగ్గరే ఆగిపోలేదు. క్రియేటివ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లం కాబట్టి కంప్లీట్ గా డైరెక్టర్ తో కూర్చుని ప్రతి విషయం డిస్కస్ చేశాం. హీరో వేసుకునే షర్ట్, అతని హెయిర్ స్టైల్ మేకోవర్ ఇలా ప్రతి విషయంలో మా ఇన్వాల్వ్ మెంట్ ఉంది. గతంలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కు వర్క్ చేసిన మేము, ఈ ఒక్క మూవీ మీదే వర్క్ చేశాం.
– దీవాన మూవీ మాకు క్రియేటివ్ గా మంచి సంతృప్తిని మిగిల్చింది. వచ్చే వారంలో ఫైనాన్షియల్ గా కూడా సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం. ఏదేమైనా మేము ఒక మంచి సినిమా చేశామని సంతోషంగా ఉన్నాం.
*ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ*
– మా మూవీ రిలీజ్ కు ముందు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాం. విశాఖ, విజయవాడ, హైదరాబాద్..ఇలా ప్రీమియర్స్ కోసం ఏర్పాట్లు చేశాం. సెన్సార్ అనుకున్న సమయానికి రాకపోవడం వల్ల అనుకున్నవి చేయలేకపోయాం. చిన్న సినిమాకు రిలీజ్ డేట్ మార్చడం ఎంత క్లిష్టమైన పనో మీకు తెలుసు.
– మా సినిమా యూత్ ఫుల్ మూవీ అనే ఇంప్రెషన్ ఆడియెన్స్ లో మొదట కలిగింది. అయితే మాది హోల్ సమ్ ఫ్యామిలీ మూవీ. ఇందులో లవ్ తో పాటు ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. మంచి డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. సినిమా చూసిన వాళ్లు ఇంటర్వెల్ రివీల్ చేయడం లేదు. అందుకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఇంటర్వెల్ పాయింట్ అనేది సినిమాకు చాలా కీలకం. సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ లో 18 ఫ్లస్ చూపించడం వల్ల చాలా మంది మూవీకి రాలేకపోతున్నారు. కానీ సినిమా చూసి వచ్చిన వారు ఫ్యామిలీతో చూడొచ్చనే చెబుతున్నారు.
– సెన్సార్ వాళ్లకు నచ్చజెప్పి రివిజన్ కు వెళ్లే టైమ్ లేకపోవడం మా ప్రాబ్లమ్. మేము సెన్సార్ ను రెస్పెక్ట్ చేస్తాము. మిగతా చిత్రాలకు ఏం జరిగిందో మాకు తెలియదు. మా సినిమాకు మాత్రం వాళ్లు చెప్పిన కట్స్ చేసిన తర్వాత కూడా ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా చూసిన వాళ్లంతా మా మూవీ గురించి బాగుందని అంటున్నారు. ఎక్కడా ఇబ్బంది పడలేదని చెబుతున్నారు. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ఇలా ఉంటే సెన్సార్ నుంచి మాత్రం మరోలా నిర్ణయం తీసుకుంది.
– సెన్సార్ వారికి మన దర్శక నిర్మాతలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లే సకాలంలో సమాచారం చేరడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సెన్సార్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఉండాలనేది నా ఉద్దేశం. అప్పుడు వారి ద్వారా మనం త్వరగా ఏదైనా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇందులో చిన్నా పెద్దా సినిమాలు అనే తేడా లేదు. మన రిప్రజెంటేషన్ ఉంటే అన్ని సినిమాలకు ఉపయోగకరంగా ఉంటుంది.
– మేము అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు గానీ డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. చూసిన వాళ్లంతా సినిమా బాగుందని అంటున్నారు. ఈ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. షోస్ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. దాంతో నెక్ట్స్ వీక్ కు మా మూవీ బాగా పికప్ అవుతుందని ఆశిస్తున్నాం. మూవీ ఔట్ పుట్ చూసినప్పుడు ఎక్కడెక్కడ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు అని మేము అనుకున్నామో ఆ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియర్స్ నుంచి ఇలా మేము అనుకున్న పాయింట్స్ కు ఆడియెన్స్ కనెక్ట్ కావడం గమనించాం. అరవింద్ గారు సినిమా చూసినప్పుడు కూడా ఎంజాయ్ చేశారు.
– మా సినిమా టికెట్ ప్రైసెస్ తగ్గించాం. సింగిల్ స్క్రీన్స్ 100 రూపాయలు, పీవీఆర్ స్క్రీన్స్ లో 105 రూపాయలు చేశాం. దీని వల్ల మరింత మంది ఆడియెన్స్ మా మూవీని చూసే వీలు కలుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం మేము రెండు చిత్రాల మీద వర్క్ చేస్తున్నాం. ఒకటి ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో మూవీ. అది తెలుగులో ఒక సరికొత్త సూపర్ హీరో సినిమా అవుతుంది. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ సూపర్ హీరో మూవీ అది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరొక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ మూవీ చేయబోతున్నాం.
