Skip to content

నార్నే నితిన్ ‘NN6’ అనౌన్స్‌మెంట్.. సర్వైవల్ యాక్షన్ డ్రామాతో కొత్త అవతార్

యంగ్ హీరో నార్నే నితిన్ తన గత మూడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా యూత్‌ఫు, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాలు చేసిన నార్నే నితిన్, తన ఆరవ చిత్రం కోసం బలమైన కథాంశం ఉన్న కథను ఎంచుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. యు సుహాస్ బాబు దర్శకత్వంలో, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ చిత్రం (#NN6), బొగ్గు గనుల నేపథ్యంలో సాగే సర్వైవల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.

మేకర్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తోంది. విస్తారమైన భూగర్భ బొగ్గు గనుల్లో చీకటి, దుమ్ము, పొగల మధ్య సాగే ప్రపంచాన్ని ఇందులో ప్రజెంట్ చేశారు. ఆ కఠిన పరిస్థితుల నడుమ నార్నే నితిన్ కనిపించే తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మైనర్ హెల్మెట్, వర్కర్ దుస్తుల్లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించిన నార్నే నితిన్ పూర్తిగా కొత్త అవతార్‌లో ఆకట్టుకున్నారు. ఆయన కళ్లలో కనిపించే తీవ్రత, హావభావాలు, కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగే పాత్రను సూచిస్తున్నాయి. వందలాది మంది కార్మికుల మధ్య, ఆయన ప్రయాణం ప్రత్యేకంగా ఉండబోతుందనే సంకేతాలను వీడియో అందించింది.

ఈ ప్రకటనతోనే సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచిన #NN6 చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

నటీనటులు
హీరో నార్నే నితిన్
సాంకేతిక బృందం
రచన & దర్శకత్వం యు సుహాస్ బాబు
నిర్మాత బొమ్మక్ శివ
బ్యానర్ రుద్రాంశ్ సెల్యులాయిడ్స్
CEO ధీరజ్ న్యతి
PRO వంశీ-శేఖర్
Back To Top