Skip to content

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ తెలుగు రిలీజ్‌కు సిద్ధం

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే మైలురాయి లాంటి చిత్రాల్లో ‘బిచ్చగాడు’ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. దర్శకుడు శశితో ‘బిచ్చగాడు’ తరువాత మళ్లీ విజయ్ ఆంటోని చేసిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పించిన ఈ మూవీని సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించారు. మానవ సంబంధాలు, ఊహించని మలుపులు, ఆకట్టుకునే డ్రామాతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాని రూపొందించారు.

బ్లాక్‌బస్టర్ చిత్రాలను పంపిణీచేస్తూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యానర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వంద దేవుళ్ళు’ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశాయి. రీసెంట్‌గా ఈ రెండు బ్యానర్స్ కలిసి రిలీజ్ చేసిన ‘రాకాస’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వారి కాంబోలో రిలీజ్ కాబోతోన్న ఈ రెండో చిత్రం ‘వంద దేవుళ్ళు’ సైతం మంచి విజయాన్ని సాధిస్తుందని అంతా నమ్ముతున్నారు.

‘వంద దేవుళ్ళు’ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటల, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.

ఈ మూవీలో విజయ్ ఆంటోని ప్రధాన పాత్ర పోషిస్తుండగా, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్ణాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుల్ దాస్, బక్స్, వినోదిని, మునీష్‌కాంత్, కొడంగి వడివేలు తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ఎస్.బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ, బాలాజీ శ్రీరామ్, హరీష్ యువరాజ్ ఎడిటింగ్, భాష్యశ్రీ డైలాగ్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.

నటీనటులు
విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, లిజోమోల్ జోస్, కావ్య, శక్తి, పదిని, కర్ణాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుల్ దాస్, బక్స్, వినోదిని, మునీష్‌కాంత్, కొడంగి వడివేలు తదితరులు
సాంకేతిక సిబ్బంది
బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత రామాంజనేయులు జవ్వాజి
దర్శకుడు శశి
సంగీతం బాలాజీ శ్రీరామ్
DOP SB దర్శన్ కిర్లోష్
ఎడిటర్ హరీష్ యువరాజ్
డైలాగ్స్ భాష్యశ్రీ
PRO సాయి సతీష్
Back To Top