Skip to content

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ పెద్ద హిట్ కావాలి : వి.వి. వినాయక్

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌కు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో..

*వి.వి. వినాయక్ మాట్లాడుతూ* .. ‘‘వడ్డే నవీన్ గారు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను ఆయన చిత్రానికి అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పని చేశాను. నవీన్‌ గారితో సినిమా చేస్తున్న టైంలోనే ‘ఆది’కి నాంది పలికినట్టు అయింది. నవీన్ గారు నన్నెంతో ఇష్టంగా చూసుకునేవారు. ఆయన కెరీర్‌లోని 90 శాతం సినిమాలు మనస్పూర్తిగా ఇష్టంతో చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు. ఓ సందర్భంలో ఆయన పరపతి చూసి షాక్ అయ్యాను. ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన చిత్రాలే చేయాలని కోరుకుంటున్నాను. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*వడ్డే నవీన్ మాట్లాడుతూ* .. ‘‘వినయ్ అప్పుడూ, ఇప్పుడూ వినయంగానే ఉన్నారు. ఆయన జర్నీ నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. మా కోసం వచ్చిన వినయ్‌కి థాంక్స్. సినిమా కోసం టీం అంతా ఇష్టపడి చేశారు. ఈ పదేళ్లలో టెక్నికల్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది. ఏ ఫ్రైడే అయినా కూడా సింగిల్‌గా సినిమా రాలేదు. ఒకరితో పోటీ అని కాదు.. మూవీ బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మాకు జీ టీం కూడా సపోర్ట్ చేస్తోంది. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

*డైరెక్టర్ కమల్ తేజ నార్ల మాట్లాడుతూ* .. ‘మా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. టీజర్, ట్రైలర్‌ల కంటే సినిమా అద్భుతంగా ఉండబోతోంది. మా కోసం వచ్చిన వినాయక్ గారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. టీం అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశారు. జూన్ 19న సినిమాని చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

*రాశీ సింగ్ మాట్లాడుతూ* .. ‘మా కోసం వచ్చి, ట్రైలర్‌ను లాంచ్ చేసిన వి. వి. వినాయక్ గారికి థాంక్స్. మా టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. వడ్డే నవీన్ గారితో పాటు ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరూ మా మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ* .. ‘మా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ కాబోతోంది. ఈ టీం నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను. జూన్ 19న అందరూ మా మూవీని చూడండి’ అని అన్నారు.

*విజయ్ పోలకి మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వడ్డే నవీన్ గారితో వర్క్ చేయడంతో ఎంతో నేర్చుకున్నాను. ఇందులో నేను రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించాను. నవీన్ గారు ఎంతో కూల్‌గా ఉంటారు. జూన్ 19న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*కెమెరామెన్ కార్తీక్ సుజాత సాయికుమార్ మాట్లాడుతూ* .. ‘‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి కందకట్ల మాట్లాడుతూ* .. ‘మా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ పెద్ద విజయం సాధిస్తుంది. నవీన్ గారి ఎనర్జీ హై రేంజ్‌లో ఉంటుంది. జూన్ 19న మా సినిమాని అందరూ చూడండి అని అన్నారు.

నటీనటులు
వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు
సాంకేతిక బృందం
సమర్పణ వడ్డే జిష్ణు | వడ్డే క్రియేషన్స్
నిర్మాత వడ్డే నవీన్
రచన, దర్శకత్వం కమల్ తేజ నార్ల
సినిమాటోగ్రఫీ కార్తీక్ సుజాత సాయికుమార్
సంగీతం కళ్యాణ్ నాయక్
సాహిత్యం భాస్కరబట్ల రవికుమార్
ఎడిటర్ విజయ్ ముక్తవరపు
ఫైట్స్ రాబిన్ సుబ్బు, రామ్ సుంకర
కొరియోగ్రఫీ విజయ్ పోలాకి, దినేష్
ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి కందకట్ల
కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య రెడ్డి
ప్రొడక్షన్ హెడ్ సతీష్ నందా
ఉత్పత్తి కంట్రోలర్ కిరణ్ కుమార్ కాసా
స్టిల్స్ వరహాల మూర్తి
పబ్లిసిటీ డిజైనర్ ఈషాన్ డిజైన్స్
లిరికల్ వీడియోలు వాల్స్ అండ్ ట్రెండ్స్
పిఆర్ఒ వంశీ కాకా
డిజిటల్ మీడియా మార్కెటింగ్ ప్రమోట్ ఈజీ
Back To Top