వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’…

రాధాకృష్ణన్ పార్తిబన్ చేతుల మీదుగా ‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ విడుదల
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఈ సారి ఓ అద్భుతమైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ‘ఫీల్ మై లవ్’ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. జీవితంలో ఏ క్షణంలోనైనా అద్భుతం జరగొచ్చు అనే కాన్సెప్ట్‌తో రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఫీల్-గుడ్ కథనం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది.
తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ రిలీజ్ చేశారు. ‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ కూడా ఎంతో ఫీల్ ఇచ్చేలా ఉంది. ఇదొక అందమైన ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథనంతో రాబోతోంది. చెన్నై, పుదుచ్చేరిలోని అద్భుతమైన లొకేషన్లలో సినిమాని చిత్రీకరించారు. చివరి షెడ్యూల్‌ను అద్భుతమైన హిల్ స్టేషన్ అయిన మున్నార్‌లో షూట్ చేయనున్నారు. ఇది కథనానికి విజువల్ గ్రాండియర్‌ను, ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది..
ఎం.ఎస్. సతీష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు. అజయ్ మనోజ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. త్వరలోనే ఓ భారీ ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టీం సందడి చేయనుంది
.
| నటీనటులు | |
|---|---|
| ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక తదితరులు | |
| సాంకేతిక బృందం | |
| బ్యానర్ | శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ |
| నిర్మాత | ఏ.ఎన్. బాలాజీ |
| దర్శకుడు | హరి ప్రకాష్ ఎం |
| సంగీత దర్శకుడు | రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి |
| కెమెరామెన్ | ఎం.ఎస్. సతీష్ |
| ఎడిటర్ | అజయ్ మనోజ్ |
| పీఆర్వో | సాయి సతీష్ |
