Skip to content

అనంత పద్మనాభ స్వామి రథయాత్రతో సంస్కృతి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం: అభిషేక్ నామా

నాగబంధం రెండేళ్ల పాటు శ్రమించి అద్భుతంగా తీసిన సినిమా. అభిషేక్ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది: హీరో విరాట్ కర్ణ

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. ఈ రోజు ఆనంత పద్మనాభ స్వామి వారి రథ యాత్రని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్వామి వారి రథయాత్ర ఈవెంట్‌లో డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ థాంక్స్. ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాదు, మన సంస్కృతి, మన మూలాలను నెక్స్ట్ జనరేషన్‌కు పరిచయం చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇందుకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంత పెద్ద విజన్‌ను సపోర్ట్ చేసిన నిషిత గారికి, కిషోర్ గారికి ధన్యవాదాలు. విరాట్‌ను చాలా కష్టపెట్టాను. తీవ్ర జ్వరంలో కూడా అతను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు. ఈ సినిమా తర్వాత విరాట్ అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. మా టీమ్ అందరికీ థాంక్యూ. జునైద్, అభి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వారి మ్యూజిక్ మీ అందరికీ నచ్చుతుంది. ఈ రథయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ.

హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అనంత పద్మనాభ స్వామి వారి రథయాత్రలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నాగబంధం ఎంతో కష్టపడి చేసిన సినిమా. రెండేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. జూలై 3న మీరందరూ థియేటర్లకు వెళ్లి మా చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అనంత పద్మనాభ స్వామి వారి రథయాత్రలో భాగంగా మేము అనేక నగరాలను సందర్శించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మా దర్శకుడు అభిషేక్ నామా గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా నిర్మాతలు నిషిత గారు, కిషోర్ గారు భారీ బడ్జెట్‌తో ఎంతో ధైర్యంగా ఈ సినిమాను నిర్మించారు. అందరం జూలై 3న థియేటర్లలో కలుద్దాం.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. స్వామి వారి రథయాత్రను ఈరోజు ప్రారంభిస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రథయాత్ర జరగబోతోంది. మీడియాకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాగబంధంకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభించింది. జూలై 3న సినిమా విడుదల కానుంది. అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అభిషేక్ గారికి, మా నిర్మాతలకు, మా హీరో విరాట్‌కు ధన్యవాదాలు. విరాట్ అద్భుతంగా నటించారు. తప్పకుండా అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ నిషిత నాగిరెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మేము విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంత ప్రేమగా ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకముందు కూడా మా ప్రమోషనల్ కార్యక్రమాలను ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు ఈ రథయాత్ర కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాము.

ప్రొడ్యూసర్ కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అనంత పద్మనాభ స్వామి యాత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తున్నాము. స్వామి వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని నమ్ముతున్నాము. తప్పకుండా స్వామి వారి ఆశీస్సులతో నాగబంధం ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వేడుక చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Back To Top