తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి కోలీవుడ్ ప్రముఖులంతా ఒక్కొక్కరిగా…

సమంత నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సెన్సార్ పూర్తి.. జూన్ 19న గ్రాండ్ రిలీజ్
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది.
‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు మేకర్స్‌ను అభినందించారు. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం జూన్ 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే సమంత ఈ సినిమా గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో ముచ్చిటిస్తూ ఈ మూవీకి సంబంధించిన ఎన్నో విషయాల్ని తెలియజేశారు.
ప్రేక్షకులు పెట్టే డబ్బు, వెచ్చించే సమయం ఇలా అన్నింటికీ న్యాయం చేసేలా సినిమా ఉంటుందని టీం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీకి ఓం ప్రకాష్ కెమెరామెన్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ సినిమా జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఈ చిత్రంలో శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుష, దిగంత్, గుల్షన్ దేవయ్యలు ముఖ్య పాత్రలు పోషించారు.
| తారాగణం | |
|---|---|
| సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు. | |
| సాంకేతిక సిబ్బంది | |
| బ్యానర్ | ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ |
| నిర్మాతలు | సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు |
| కథ & స్క్రీన్ ప్లే | రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, సీతా మీనన్ |
| డైరెక్టర్ | నందిని రెడ్డి |
| సినిమాటోగ్రఫీ | ఓం ప్రకాష్ |
| సంగీతం | సంతోష్ నారాయణన్ |
| యాక్షన్ | లీ విట్టేకర్, ఎజాజ్ గులాబ్ |
| ఎడిటింగ్ | ధర్మేంద్ర కాకరాల |
| ప్రొడక్షన్ డిజైన్ | ఉల్లాస్ హైదూర్ |
| PRO | వంశీ కాకా |
