యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఆల్ఫా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది…

విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ రిలీజ్ చేసిన నిహారిక కొణిదెల
విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ‘వంద దేవుళ్ళు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళ తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లతో మంచి అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాకు తాజాగా మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం.
‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి.. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం’ అనే ఆలోచనాత్మక డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ప్రేక్షకులను వెంటనే కథలోకి తీసుకెళ్తుంది. ప్రేమ, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, అనుబంధాల చుట్టూ తిరిగే కథను దర్శకుడు హృద్యంగా మలిచినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. విజయ్ ఆంటోని, స్వాసిక మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకోగా, భార్యాభర్తల బంధం, తల్లీకొడుకుల అనుబంధం వంటి భావోద్వేగ అంశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అర్థమవుతోంది. అదే సమయంలో యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్, బాలాజీ శ్రీరామ్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చాయి.
ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాసిక నటన ఎంతో ఆకట్టుకుందని ప్రశంసించారు. అలాగే దర్శకుడు శశి ఒక హృద్యమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని, విజయ్ ఆంటోని ఈసారి మరో విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. భావోద్వేగాలు, బంధాలు, జీవిత సత్యాలను సమ్మిళితం చేసిన కథతో ‘వంద దేవుళ్ళు’ ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించబోతుందనే సంకేతాలను ట్రైలర్ బలంగా ఇస్తోంది. జూన్ 19న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
| వంద దేవుళ్ళు – తారాగణం & సాంకేతిక బృందం | |
|---|---|
| నటీనటులు | విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు |
| బ్యానర్ | విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ |
| సమర్పణ | ఫాతిమా విజయ్ ఆంటోని |
| నిర్మాత | రామంజనేయులు జవ్వాజి |
| దర్శకుడు | శశి |
| సంగీతం | బాలాజీ శ్రీరామ్ |
| డీఓపీ | ఎస్. బి. దర్శన్ కిర్లోష్ |
| ఎడిటర్ | హరిష్ యువరాజ్ |
| మాటలు | భాష్య శ్రీ |
| పీఆర్వో | సాయి సతీష్ |

Comments (0)