జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కొత్త మలుపు’ సినిమాపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రముఖ గాయని సునీత కుమారుడు…

జూన్ 12న ‘పోలీస్ కంప్లైంట్’ రిలీజ్.. చిత్ర యూనిట్‌కు ఆదిశేషగిరిరావు అభినందనలు
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించగా, ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను అభినందించడం విశేషం. పాట అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన, సినిమా ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, ఆదిశేషగిరిరావు గారి ప్రశంసలు తమ చిత్ర బృందానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని తెలిపారు. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. హారర్, థ్రిల్లర్‌తో పాటు యాక్షన్, ఎమోషన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేస్తాయని పేర్కొన్నారు.
హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, సూపర్‌స్టార్ కృష్ణ గారిపై రూపొందించిన ప్రత్యేక గీతంలో నటించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆ పాటను ఆదిశేషగిరిరావు గారు మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. దర్శకుడు సంజీవ్ మేగోటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందింది. ట్రైలర్‌తో పాటు ప్రత్యేక గీతాలకు కూడా మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆదిశేషగిరిరావు ఆశీర్వాదాలు తోడవడంతో ‘పోలీస్ కంప్లైంట్’ విడుదలకు ముందే మరింత పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది.
| చిత్రబృందం | |
|---|---|
| నటీనటులు | వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, ప్రీతీ సుందర్, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్, మధు నంబియార్, సత్తెన్న, విజయభాస్కర్, అనిల్ రాజ్, శ్రీహర్ష, దేవేందర్, పుష్పారామ్, డీఎస్పీ తదితరులు |
| బ్యానర్ | ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ |
| నిర్మాత | బాలకృష్ణ మహారాణా |
| దర్శకత్వం | సంజీవ్ మేగోటి |
| ఛాయాగ్రహణం (DOP) | ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప |
| ఆపరేటివ్ కెమెరామెన్ | సెంథిల్ కుమార్ |
| ఎడిటర్ | అనుగోజు రేణుకా బాబు |
| ఆర్ట్ డైరెక్టర్ | కె.వి. రమణ |
| ప్రొడక్షన్ డిజైనర్ | కొండపనేని మురళీధర్ |
| మేకప్ | విజయ్ – శేఖర్ |
| కాస్ట్యూమ్స్ | నల్లపు సతీష్ |
| కొరియోగ్రఫీ | పైడి రాజు, సన్ రేస్, మెహర్ బాబా |
| ఫైట్స్ | డ్రాగన్ ప్రకాష్, రవితేజ |
| సంగీతం | ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో |
| సాహిత్యం | సాగర్ నారాయణ, సంజీవ్, చింతల ప్రసన్న రాములు, సుధాకర్ మారియో |
| సౌండ్ డిజైనింగ్ & ఆడియోగ్రఫీ | దొంతం ప్రవీణ్ రెడ్డి |
| వీఎఫ్ఎక్స్ | మ్యాజిక్ లూమ్ విజయ్ |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | సతీష్ |
| ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ | బిజివేముల రాజశేఖర్ రెడ్డి |
| ప్రొడక్షన్ మేనేజర్లు | రమేష్, కొల్లా గంగాధరం |
| సహ దర్శకులు | ఎం. కృష్ణ, కె. వెంకట నారాయణ |
| చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ | పేరం అయాన్ష్ రెడ్డి (అశోక్), పవన్ కుమార్ గొడవర్తి |
| అసోసియేట్ డైరెక్టర్స్ | కృష్ణమూర్తి, ఎన్. రామ్ కుమార్, మద్దిలచెరువు దీపక్ |
| సహాయ దర్శకులు | నవీన్ కపిల్, కంచె వీరేష్, స్వాతి మంగాపురం, కె. మహేశ్వర్, కందెల గణేష్, యశ్వంత్ కుమార్, పీవీఎస్ నీరజ్ |
| పీఆర్ఓ | అశోక్ దయ్యాల |

Comments (0)