లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు…

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు చేతుల మీదుగా నూతన చిత్రం ‘మొహబ్బత్’ ఘన ప్రారంభం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యాక్ (సలీమ్ మాలిక్) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ క్లాప్ కొట్టగా, నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, అది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్మాత అఫ్రోజ్ షేక్ ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. సినిమా రంగంలో పనిచేసే వారి కష్టాలు తనకు తెలుసని, ఈ చిత్ర బృందం అంతా కలిసి మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ, ఎమోషనల్ యూత్‌ఫుల్ జెన్-జీ లవ్ స్టోరీగా ‘మొహబ్బత్’ రూపొందుతోందని, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. నిర్మాత అఫ్రోజ్ షేక్ మాట్లాడుతూ, తన బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘మొహబ్బత్’ను నిర్మించడం ఆనందంగా ఉందని, దర్శకుడు మ్యాక్ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, కథలోని భావోద్వేగాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ, ప్రేమకథలకు సంగీతం ఎంతో కీలకమని, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. స్టోరీ, డైలాగ్ రైటర్ కలాం మాట్లాడుతూ, బలమైన భావోద్వేగాలతో కూడిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు. మొత్తంగా, లాంచ్ కార్యక్రమం నుంచే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ‘మొహబ్బత్’పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Comments (0)