తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘బిచ్చగాడు’ వంటి…

అభిమానుల కోసం రక్తం చిందించి అయినా పని చేస్తా”.. ‘పెద్ది’పై రామ్ చరణ్ భావోద్వేగ వ్యాఖ్యలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, విజయవాడలో నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సందడితో ఉత్సాహభరితంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన ఈ వేడుకలో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
‘పెద్ది’ తన సినీ ప్రయాణంలో అత్యంత ప్రత్యేకమైన చిత్రమని చెప్పిన రామ్ చరణ్, ఇలాంటి కథలు పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని అన్నారు. ఒక నటుడిగా తనకు అపారమైన సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇదేనని పేర్కొన్నారు. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమే తనకు బలమని చెబుతూ, “వారి కోసం చేయి విరగ్గొట్టుకోవడమే కాదు, రక్తం చిందించి అయినా పని చేస్తాను” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. చిరంజీవి కుమారుడిగా, పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా తనకు తెలిసింది సినిమా మాత్రమేనని, జీవితాంతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘పెద్ది’ కేవలం కమర్షియల్ సినిమా కాదని, ఒక వ్యక్తి ఆత్మగౌరవం, గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని హృదయాన్ని తాకేలా ఆవిష్కరించే ఎమోషనల్ జర్నీ అని వివరించారు. ఓటమిని ఎదుర్కొని మళ్లీ నిలబడే మనిషి కథే ‘పెద్ది’ అని చెప్పిన ఆయన, సినిమా చూసిన ప్రతిసారీ తనకు భావోద్వేగం కలుగుతుందని తెలిపారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు కూడా సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగపతి బాబు తన కెరీర్‌లో ‘అప్పలసూరి’ పాత్ర బెస్ట్ క్యారెక్టర్‌గా నిలుస్తుందని చెప్పడం విశేషం. మరోవైపు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ‘పెద్ది’లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. భారీ నిర్మాణ విలువలు, బలమైన భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్, పాటలతో సంచలనం సృష్టించిన ‘పెద్ది’ జూన్ 4న ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాల్సి ఉంది.


Comments (0)