మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి…

తెలుగు ఫిలిం చాంబర్లో నూతన APSFTvTDC చైర్మన్ భరత్ భూషణ్, డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావుకు ఘన సత్కారం
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTvTDC) కార్యవర్గ సభ్యులను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బ్యారర్స్ మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కీలక వేదికగా నిలిచిన ఫిలిం చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా చాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో సినీ, టెలివిజన్, థియేటర్ రంగాల అభివృద్ధికి APSFTvTDC కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కొత్త కార్యవర్గం పరిశ్రమ సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల అభివృద్ధికి, యువ ప్రతిభకు ప్రోత్సాహం అందించేందుకు సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సి. భరత్ చౌదరి, గౌరవ కార్యదర్శులు కె. అశోక్ కుమార్, కెవివి ప్రసాద్, గౌరవ జాయింట్ సెక్రటరీలు మోహన్ వడ్లపట్ల, ఎం. విజేందర్ రెడ్డి, గౌరవ కోశాధికారి ఎం. రాందాస్‌తో పాటు పలువురు ఈసీ సభ్యులు పాల్గొని APSFTvTDC చైర్మన్ భరత్ భూషణ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రముఖ దర్శక నిర్మాత, APSFTvTDC డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావును ప్రత్యేకంగా సన్మానిస్తూ ఆయన సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని పేర్కొన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పరిశ్రమలో అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తేనే తెలుగు సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఎదుగుతుందని అన్నారు.
తెలుగు ఫిలిం చాంబర్ ప్రతినిధులు కూడా పరిశ్రమ అభివృద్ధికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లు, థియేటర్ వ్యవస్థ, కొత్త సాంకేతికతల ప్రోత్సాహం వంటి అంశాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పరస్పర సహకారం, ఐక్యత, పరిశ్రమ సంక్షేమం అనే లక్ష్యాలతో జరిగిన ఈ సమావేశం సినీ వర్గాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

