Skip to content

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు రాజమహేంద్రవరంలో సమావేశం కావడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలు, ప్రభుత్వ సహకారం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. నిర్మాతలు వై. రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ పాల్గొనడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. సినిమా రంగానికి సంబంధించి మౌలిక వసతులు, షూటింగ్‌లకు అనుకూల వాతావరణం, కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపు వంటి విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా ముందుకు రావాలనే దిశగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీ కీలకంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Back To Top