Skip to content

నాగార్జున 40 ఏళ్ల సినీ ప్రయాణానికి ట్రిబ్యూట్‌గా ‘లెనిన్’ టీజర్ విడుదల

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినీ ప్రయాణానికి నలభై ఏళ్లు పూర్తైన ప్రత్యేక సందర్భంలో విడుదలైన ‘లెనిన్’ టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, గ్లింప్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా విడుదలైన టీజర్‌తో మరింత హైప్ తెచ్చుకుంది. “మనోడు వస్తున్నాడు” అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌లో అఖిల్ అక్కినేని కనిపించిన మాస్, రగ్డ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన” అంటూ ఆయన చెప్పిన డైలాగ్ పాత్రలోని తీవ్రతను అద్భుతంగా చూపించింది. ముఖ్యంగా చిత్తూరు యాసలో అఖిల్ అక్కినేని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. భాగ్యశ్రీ బోర్సే చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ టీజర్‌కు మరో హైలెట్‌గా నిలిచాయి. పీరియాడిక్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంటెన్స్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్టు టీజర్ స్పష్టం చేస్తోంది. అద్భుతమైన విజువల్స్‌కు తోడు తమన్ ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత ఎలివేట్ చేసింది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శివాజీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

తారాగణం
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, శివాజీ తదితరులు
సాంకేతిక సిబ్బంది
బ్యానర్లు మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సమర్పణ అన్నపూర్ణ స్టూడియోస్
రచయిత & దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు
సంగీతం థమన్ ఎస్
ఎడిటర్ నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ లియోన్ బ్రిట్టో
ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top