మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి…

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి వినియోగిస్తా : చదలవాడ శ్రీనివాసరావు
మానవతావాది, కళాపోషకుడిగా గుర్తింపు పొందిన చదలవాడ శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా నియమించిన సందర్భంగా తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. పరిశ్రమలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ, సినీ రంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి సభ్యులు బాలరెడ్డి, ఎం. గిరిధర్, చదలవాడ భరద్వాజ్, అప్పాజీ, శ్రీమతి పర్వీన్, బాబీ నవీన్ తదితరులు పాల్గొని చదలవాడ శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేశారు. సినీ పరిశ్రమ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి, సేవాభావం దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకాన్ని పలువురు వ్యక్తం చేశారు.

