Skip to content

‘ఫస్ట్ టైం’ మూవీ రివ్యూ

‘ఫస్ట్ టైం’ మూవీ రివ్యూ

తక్కువ బడ్జెట్‌తో భారీ విజువల్ అనుభూతిని అందించే ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం “ఫస్ట్ టైం”. హేమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, మైథాలజీ అంశాల మేళవింపుగా రూపొందింది. సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా, ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్రలో నటించారు. అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా కనిపించారు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్త తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ

2304 ఏడీలో ఏలియన్స్ నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. కలియుగం ఎలా అంతమైందో, కొత్త సృష్టి ఎలా ఆవిర్భవించిందో చూపించే కాన్సెప్ట్‌తో సినిమా ముందుకు సాగుతుంది. పవిత్రమైన ఓ స్త్రీ ద్వారా కొత్త ప్రపంచ నిర్మాణం ఎలా ప్రారంభమైందనే అంశాన్ని కథలో ఆసక్తికరంగా మలిచారు. హీరోయిన్ అనిక్క విక్రమన్‌ను తమవారిగా చేసుకోవాలని విలన్లు ప్రయత్నించే నేపథ్యంలో ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, హీరో సౌరబ్ ధింగ్రతో ఆమె ప్రయాణం, చివరకు కొత్త భారత ప్రపంచం ఎలా రూపుదిద్దుకుందనే అంశాలు కథలో ప్రధానంగా నిలుస్తాయి.

నటీనటుల పనితీరు

హీరోగా పరిచయమైన సౌరబ్ ధింగ్ర తన తొలి చిత్రానికే మంచి నటన కనబరిచారు. అనిక్క విక్రమన్ గ్లామర్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నారు. అఖిల్ సార్థక్ తన పాత్రకు తగ్గట్టుగా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. భూపాల్ రాజు, శివకుమార్ రామచంద్రవరపు విలన్ షేడ్స్‌లో మెప్పించారు. మైమ్ గోపి, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, గాయత్రి గుప్త పాత్రలు కథకు బలం చేకూర్చాయి.

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి ప్రధాన బలం టెక్నికల్ వాల్యూస్. ఎలాంటి AI టెక్నాలజీ వాడకుండా హ్యూమన్ ఇంటలిజెన్స్‌తో భారీ విజువల్స్‌ను రూపొందించడం ప్రత్యేకత. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి తన విజన్‌ను తెరపై బాగా ఆవిష్కరించారు. గత వీఎఫ్ఎక్స్ అనుభవాన్ని ఉపయోగించి గ్రాండ్ విజువల్స్‌ను అందించారు. వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు విజువల్ రిచ్‌నెస్ తీసుకొచ్చింది. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాలకు మంచి బలం అయ్యాయి.

ప్లస్ పాయింట్స్:

  • గ్రాండ్ విజువల్స్
  • కొత్త కాన్సెప్ట్
  • నటీనటుల పనితీరు
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
  • సెకండ్ హాఫ్‌లో వచ్చే ఉత్కంఠభరిత సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

  • ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా అనిపించడం కథనం కొంత క్లిష్టంగా ఉండటం

ఫైనల్ వెర్డిక్ట్

“ఫస్ట్ టైం” సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, కొత్త తరహా విజువల్ అనుభూతిని ఇవ్వాలనే ప్రయత్నంగా తెరకెక్కిన చిత్రం. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. తక్కువ బడ్జెట్‌లో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ న్యూ ఏజ్ మూవీ మంచి ప్రయత్నంగా నిలుస్తుంది.

రేటింగ్ : 3/5

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top