‘రాకాస’ సినిమాకు థియేటర్లో అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఓటీటీలోనూ ఈ చిత్రం దూసుకుపోతోంది. నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లో టాప్ 7కి ‘రాకాస’ చేరుకుంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్‌తో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతూ ఉందని నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది.
ఈ ఘనతతో ఈ వారం నెట్ ఫ్లిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో ‘రాకాస’ పలు అంతర్జాతీయ మార్కెట్ల చిత్రాల సరసన నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కంటే డిజిటల్ స్ట్రీమింగ్‌లో మరింత ఆదరణ లభిస్తోందని ఈ లెక్కలే చెబుతున్నాయి. థియేటర్లలో నెమ్మదిగా మౌత్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్లియర్ రెస్పాన్స్ పొందినట్టుగా దూసుకుపోతోంది. థియేటర్లలోనే ఈ మూవీని అందరూ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు అదే ఆదరణ ఓటీటీలోనూ కనిపిస్తోంది.
ప్రమోషన్స్‌తోనే అందరినీ ఆకట్టుకున్న ‘రాకాస’ టీం.. థియేటర్లలో మ్యాజిక్ చేసింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరినీ ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇక దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం అందరూ ఎదురు చూడసాగారు. ఓటీటీలోకి ‘రాకాస’ అలా వచ్చిందో లేదో ఇలా టాప్‌లో ట్రెండ్ అయింది. సంగీత్ శోభన్ – గెటప్ శ్రీను ట్రాక్, వెన్నెల కిషోర్ నటన ఈ సినిమాను పదేపదే చూసేలా చేయడంలో ఎంతగానో దోహదపడ్డాయి.
పిల్లలకు ఈ చిత్రంలోని ఫాంటసీ నచ్చితే.. పెద్ద వాళ్లకి కామెడీ, ఎంటర్టైన్మెంట్ నచ్చాయి. అలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ‘రాకాస’ ఆకట్టుకోవడంతో థియేటర్లతో పాటుగా ఓటీటీలోనూ దుమ్ములేపేస్తోంది. సమ్మర్‌లో కూల్ మూవీగా, వేసవి సెలవుల్లో కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ‘రాకాస’ నిలిచింది. ఇక ఈ కారణంతోనే ఇప్పుడు ఓటీటీలో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో ‘రాకాస’ ఎంట్రీని గమనిస్తే.. తెలుగు సినిమాకు పెరుగుతున్న అంతర్జాతీయ గుర్తింపును మరింతగా నొక్కి చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై, జీ స్టూడియోస్ సహకారంతో నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ‘రాకాస’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది.
















Comments (0)