సినిమాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరత్ భూషణ్ గారిని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించడం హర్షించదగిన విషయం. చలన చిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భరత్ భూషణ్ గారిని చైర్మన్ గా నియమించి రాష్ట్రంలో ఈ సంస్థ అభివృద్ధి బాధ్యతలను ఆయనకు అప్పగించడం జరిగింది.
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా భరత్ భూషణ్…అభినందించిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ
May 9, 2026•4 second read

Share this Article
Related Articles
No Comments
Search
[sureforms id='2715']
RECEIVE THE LATEST & BEST UPDATES VIA EMAIL
Subscribe today and don't miss out on any important articles.
Popular Articles
“వైల్డ్” సినిమా ఫస్ట్ లుక్ &మోషన్ పోస్టర్ రిలీజ్May 1, 2026
మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్ – ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోందిMay 4, 2026
తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కు అందించిన హీరో కృష్ణసాయిMay 9, 2026
గాయపడ్డ సింహం’లో మంచి ఫన్ వైబ్ ఉన్న క్యారెక్టర్ చేశాను : హీరోయిన్ ఫరియా అబ్దుల్లాApril 28, 2026
‘సతీ లీలావతి’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్May 2, 2026










Comments (0)