Skip to content
Movies

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్.. మే 15న థియేటర్స్‌లో సందడి!

May 7, 202625 second read

ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా చాలా క్రియేటివ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. పాయల్, త్రిగుణ్ అందరూ మంచి టీమ్‌వర్క్‌తో చేశారు. ఇందులో విజువల్స్, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి. నచ్చితే పదిమందికి చెప్పండి. మీ అందరి ప్రోత్సాహం కావాలని కోరుకుంటున్నాను. రామ్ దాస్ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను గ్రాండ్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దాసరి గారు “ప్రేక్షక దేవుళ్లు” అనేవారు. ఆయన ఎందుకు అలా అనేవారో ఈ రోజు అర్థమైంది. ప్రేక్షకులు కనికరిస్తేనే సినిమా ప్రాణం పోసుకుంటుంది. ఈ సినిమా మనం రోజువారీగా చూసే పాత్రలు, సంఘటనలతో సరదాగా ఉంటుంది. అలాగే ఇందులో అద్భుతమైన ప్రేమకథ ఉంటుంది. ఆ ప్రేమకథలోని కాన్ఫ్లిక్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రామ్ దాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేయడం మా నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఈ సినిమా సమ్మర్‌లో అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో చూపించిన క్లైమాక్స్ కూడా నిజ జీవితానికి ఉపయోగపడుతుంది. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బలంగా ఉంటుంది. పాయల్, త్రిగుణ్ అద్భుతంగా నటించారు. పాయల్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పారు. త్రిగుణ్ నా ఫస్ట్ హీరో. తనని ఎప్పటికీ మర్చిపోలేను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ. నేను ఇక్కడే సెటిల్ అవ్వాలని భావిస్తున్నాను. వరుసగా ఇక్కడ సినిమాలు రావడం, తాజాగా ‘పాపం ప్రతాప్’తో విజయం రావడం ఆనందంగా ఉంది. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మే 15న అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. చాలా మంచి సినిమా తీసుకొస్తున్నాం. మే 15న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్‌లో సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. పాయల్ లక్ ఈ సినిమాకి కలిసి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను.

డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామ్ దాస్ మాట్లాడుతూ.. ‘ఈషా’తో విజయాన్ని అందుకున్న త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’తో మంచి ప్రశంసలు అందుకున్న పాయల్ రాధాకృష్ణ ఈ చిత్రంలో చాలా చక్కగా నటించారు. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించారు. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇందులో కూడా అలాంటి మంచి కాన్సెప్ట్ ఉంది. నిర్మాత అరవింద్ చాలా మంచి ప్యాషన్‌తో నిర్మించారు. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్స్‌లో సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను.

I am text block. Click edit button to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

నటీనటులు
ప్రధాన తారాగణం త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా, శివాజీరాజా, హర్ష వర్ధన్,
సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నర్సింహారావు,
గుండు సుదర్శన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు
సాంకేతిక విభాగం
దర్శకత్వం మధుదీప్ చెలికాని
నిర్మాత అరవింద్ మండెం
సమర్పణ CH.V.S.N బాబ్జీ
బ్యానర్ లోటస్ క్రియేటివ్ వర్క్స్
స్క్రిప్ట్ కోఆర్డినేటర్ పవన్ కొడాలి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రవికుమార్ వి.
ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం ప్రకాశ్ చెరుకూరి, అరుణ్ చిలువేరు
సౌండ్ డిజైనర్ సంతోష్ వొదనల
యాక్షన్ కొరియోగ్రఫీ రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్స్ JK ఫ్రేమ్స్
PRO తేజస్వి సజ్జా
Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top